Sharmila: కేసీఆర్ మారు పేరు 420..కేసీఅర్ ఒక మోసగాడు

ABN , First Publish Date - 2023-02-05T12:47:47+05:30 IST

బంగారు తెలంగాణ చేస్తామని చెప్పి బార్లు, బీర్ల తెలంగాణగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే(CM KCR) దక్కిందని

Sharmila: కేసీఆర్ మారు పేరు 420..కేసీఅర్ ఒక మోసగాడు

వరంగల్: బంగారు తెలంగాణ చేస్తామని చెప్పి బార్లు, బీర్ల తెలంగాణగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే(CM KCR) దక్కిందని వైఎస్ఆర్టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల (YSRTP State president Sharmila)శనివారం చేసిన పాదయాత్రలో మండిపడ్డారు. కాగా,నేడు ఆదివారం షర్మిల పాదయాత్ర వరంగల్ పట్టణంలోకి ప్రవేశిచింది. పాదయాత్రలో షర్మిల మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వంపై మరోసారి మండిపడ్డారు. రాష్ట్రంలో ఉద్యోగాలు లేక యువత ఆత్మహత్య చేసుకుంటుంన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రుణాలు మాఫీ కాక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వం కొంచెం కూడా పట్టించుకోకుండా నిమ్మకునీరేత్తినట్లు ఉందంటూ ధ్వజమెత్తారు. కేసీఆర్ మారు పేరు 420..కేసీఅర్ ఒక మోసగాడు అని తీవ్ర స్థాయిలో విమర్శించారు. సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మిమ్మల్ని తరిమి కొట్టే రోజులు దగ్గర్లో పడ్డాయని, ఇప్పటికైనా హామీలను నిలబెట్టుపెట్టుకోవాలని సూచించారు. కేసీఆర్ దిక్కుమాలిన పాలనలో రాష్ట్రంలో ఎనిమిదిన్నర వేలమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, అసెంబ్లీ(Assembly) సాక్షిగా మంత్రి కేటీఆర్(Minister KTR) పచ్చి అబద్ధాలు చెప్తున్నారని షర్మిల మండిపడ్డారు.

Updated Date - 2023-02-05T12:49:28+05:30 IST