Kadiam Srihari: స్థానిక నాయకత్వం నన్ను పట్టించుకోవడం లేదు..

ABN , First Publish Date - 2023-04-02T13:18:01+05:30 IST

జనగామ: స్టేషన్ ఘనపూర్ (Station Ghanpur) నియోజకవర్గం (Constituency)లో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి.

Kadiam Srihari: స్థానిక నాయకత్వం నన్ను పట్టించుకోవడం లేదు..

జనగామ: స్టేషన్ ఘనపూర్ (Station Ghanpur) నియోజకవర్గం (Constituency)లో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. స్థానిక నాయకత్వం తనను పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ నేత (BRS Leader), మాజీ మంత్రి కడియం శ్రీహరి (Kadiam Srihari) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అందరినీ కలుపుకుని ఆత్మీయ సమ్మేళనాలు (Spiritual Compounds) నిర్వహించాలని చెబితే.. స్థానిక నాయకత్వం తనను విస్మరించిందని ఆరోపించారు.

స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో జరిగే ఆత్మీయ సమ్మేళనాలకు తనకు ఆహ్వానం లేదని కడియం శ్రీహరి ఆరోపించారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ బీ ఫామ్ ఇచ్చిన అభ్యర్థికి తాను సపోర్టు చేశానన్నారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి పల్లా రాజేశ్వర్ రెడ్డి (Palla Rajeshwar Reddy)కి ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ సహకరించానన్నారు. కానీ ఇప్పుడు స్థానిక నాయకత్వం తనను విస్మరిస్తోందని కడియం శ్రీహరి ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2023-04-02T13:18:01+05:30 IST