Warangal: నేడు జనగామ జిల్లాకు రానున్న కేటీఆర్
ABN , First Publish Date - 2023-12-05T08:57:39+05:30 IST
జనగామ: బీఆర్ఎస్ నేత కేటీఆర్ మంగళవారం జనగామకు రానున్నారు. చిల్పూర్ మండలం, రాజవరంలో జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి అంత్యక్రియల్లో ఆయన పాల్గొననున్నారు. సోమవారం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు.
జనగామ: బీఆర్ఎస్ నేత కేటీఆర్ మంగళవారం జనగామకు రానున్నారు. చిల్పూర్ మండలం, రాజవరంలో జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి అంత్యక్రియల్లో ఆయన పాల్గొననున్నారు. సోమవారం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు.
పూర్తి వివరాలు...
జనగామ జడ్పీ చైర్మన్, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్‌రెడ్డికి సోమవారం సాయంత్రం గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన హనుమకొండలోని రోహిణి ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థుల తరఫున సంపత్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఆయన మృతితో కార్యకర్తలు, అభిమానులు కన్నీటి పర్యంతమయ్యారు. సంపత్‌రెడ్డి మృతిపై కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఉద్యమం నుంచి సంపత్‌రెడ్డి తన వెంట నడిచారని.. ఆయన మృతి బాధాకరమన్నారు. సంపత్‌రెడ్డి కుటుంభానికి సానుభూతి తెలిపారు. ఆ కుటుంబానికి బీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందని కేసీఆర్ భరోసా ఇచ్చారు.