Congress Leader: తెలంగాణ ప్రజలు బై బై కేసీఆర్ అంటున్నారు

ABN , First Publish Date - 2023-09-18T12:36:09+05:30 IST

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని సీడ్ల్యూసీ మెంబర్ సల్మాన్ ఖుర్షద్ ధీమా వ్యక్తం చేశారు.

Congress Leader: తెలంగాణ ప్రజలు బై బై కేసీఆర్ అంటున్నారు

వరంగల్: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని సీడ్ల్యూసీ మెంబర్ సల్మాన్ ఖుర్షద్ (CWC Member Salman Khurshid) ధీమా వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు బై బై కేసీఆర్ (CM KCR) అంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని అన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కాంగ్రెస్‌తోనే సాధ్యమని చెప్పుకొచ్చారు. ప్రజలకు మరింతగా చేరువయ్యేందుకు కాంగ్రెస్ ముందుకెళ్తోందన్నారు. సీడబ్ల్యుసీ సమావేశాలు తెలంగాణలో నిర్వహించడం గొప్ప విషయమన్నారు. తెలంగాణ అభివృద్ధికి వ్యూహ రచన చేశామని తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్‌లను ప్రజలు నమ్మే స్థితిలో లేరని సల్మాన్ ఖుర్షీద్ వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2023-09-18T12:36:09+05:30 IST