Share News

BRS: తెలంగాణ భవన్ వద్ద గెల్లు శ్రీనివాస్‌కు అవమానం !

ABN , First Publish Date - 2023-10-15T11:40:59+05:30 IST

తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్‌కు తెలంగాణ భవన్ వద్ద అనూహ్య పరిస్థితి ఎదురైనట్టు తెలుస్తోంది. నేడు (ఆదివారం) అభ్యర్థులకు బీ-ఫారాల అందజేత సందర్బంగా తెలంగాణ భవన్ వద్దకు వచ్చిన ఆయనను సిబ్బంది బయటకుపించారు.

BRS: తెలంగాణ భవన్ వద్ద గెల్లు శ్రీనివాస్‌కు అవమానం !

హైదరాబాద్: తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్‌కు తెలంగాణ భవన్ వద్ద అనూహ్య పరిస్థితి ఎదురైనట్టు తెలుస్తోంది. నేడు (ఆదివారం) అభ్యర్థులకు బీ-ఫారాల అందజేత సందర్బంగా తెలంగాణ భవన్ వద్దకు వచ్చిన ఆయనను సిబ్బంది బయటకుపించారు. జాబితాలో పేరు లేదంటూ అక్కడి నుంచి పంపించేశారు. ఈ పరిణామాన్ని గెల్లు శ్రీనివాస్ అవమానంగా భావిస్తున్నారని తెలుస్తోంది. కాగా గెల్లు శ్రీనివాస్ గతంలో హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈటెల రాజేందర్‌పై పోటీ చేశారు. మరోవైపు మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డిని సైతం పోలీసులు అడ్డుకున్నారు. అయితే మల్లారెడ్డి స్వయంగా వచ్చి రాజశేఖర్ రెడ్డిని లోపలికి తీసుకెళ్లారు.

Updated Date - 2023-10-15T11:40:59+05:30 IST