Share News

Congress: ఒకే ఊరు నుంచి ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు

ABN , First Publish Date - 2023-12-04T05:29:52+05:30 IST

ఒకే ఊరికి చెందిన ఇద్దరు నేతలు ఒకే పార్టీ తరఫున ఎమ్మెల్యేలుగా గెలుపొందడం, ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఒకే పార్టీ తరఫున పోటీచేసి పరాయజం పాలవ్వడం..

Congress: ఒకే ఊరు నుంచి  ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు

గండుగులపల్లికి చెందిన తుమ్మల, జారె విజయం

కూసుమంచి, ఖమ్మం, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): ఒకే ఊరికి చెందిన ఇద్దరు నేతలు ఒకే పార్టీ తరఫున ఎమ్మెల్యేలుగా గెలుపొందడం, ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఒకే పార్టీ తరఫున పోటీచేసి పరాయజం పాలవ్వడం.. ఈ రెండు అరుదైన సంఘటనలు ఈ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో చోటుచేసుకున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లి గ్రామానికి చెందిన జారె ఆదినారాయణ, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులుగా భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఖమ్మం నుంచి తుమ్మల 50,130 ఓట్ల మెజారిటీతో, అశ్వారావుపేట నుంచి జారే ఆదినారాయణ 28,457 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఇద్దరూ ఇటీవలే బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రె్‌సలో చేరి గెలుపొందడం విశేషం. మరోవైపు కూసుమంచి మండలం రాజుపేట గ్రామానికి చెందిన సండ్ర వెంకటవీరయ్య, కందాళ ఉపేందర్‌రెడ్డిలు బీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసి ఓటమిపాలయ్యారు. సత్తుపల్లి నుంచి సండ్ర, పాలేరు నుంచి నుంచి కందాళ పరాజయం పాలయ్యారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలుపొందిన వీరయ్య, కాంగ్రెస్‌ తరఫున ఎన్నికైన కందాళ.. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో బీఆర్‌ఎ్‌సలో చేరారు. అయితే వీరిద్దరూ కూడా ఈసారి కాంగ్రెస్‌ అభ్యర్థుల చేతిలో ఓడిపోవడం గమనార్హం.

Updated Date - 2023-12-04T09:10:52+05:30 IST