TS News: ఆయన అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్నారు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2023-05-03T17:38:29+05:30 IST

రాష్ట్ర బీజేపీ (BJP) అధ్యక్షుడు బండి సంజయ్ (Bandii Sanjay) అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్నారని బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ (MLA Bajireddy Govardhan reddy) మండిపడ్డారు.

TS News: ఆయన అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్నారు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే

హైదరాబాద్: రాష్ట్ర బీజేపీ (BJP) అధ్యక్షుడు బండి సంజయ్ (Bandii Sanjay) అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్నారని బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ (MLA Bajireddy Govardhan reddy) మండిపడ్డారు. ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా మాట్లాడే భాష ఇదేనా? అని ఆయన ప్రశ్నించారు. చెత్త ఆరోపణలు చేస్తున్నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ (Telangana)లో కేసీఆర్ (KCR) ప్రభుత్వం 24 గంటల విద్యుత్, రైతు బీమా, రైతు బంధు ఇస్తున్నారని పేర్కొన్నారు. అకాల వర్షాలకు పంట నష్ట పోయిన రైతులకి 10 వేల రూపాయలు సీఎం ప్రకటించారని చెప్పారు. కేంద్రం నుంచి బండి సంజయ్ ఎంత తీసుకు వస్తారు? అని ప్రశ్నించారు. బీజేపీ నేతలు వాట్సప్ యూనివర్సిటీలో అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రైతుల దగ్గరికి వెళ్లి మోసపు మాటలు చెబుతున్నారని ఆయన మండిపడ్డారు. కర్ణాటకలో బీజేపీ పని అయిపోయిందన్నారు. కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యేలు 40 శాతం కమిషన్లు తీసుకున్నారని ఆరోపించారు. వ్యక్తి గత విమర్శలు మీరు చేస్తే తాము వంద చేస్తామని హెచ్చరించారు. ఎంపీ అరవింద్ చేసింది ఏమీ లేదు.. అడ్డగోలు మాటలు తప్ప అని విమర్శించారు. బీజేపీ మోసాన్ని ప్రతి నియోజక వర్గంలో ప్రజలకు వివరిస్తామని తెలిపారు. బండి సంజయ్ తెలివి మోకాళ్ళలో ఉందని విమర్శించారు. ఆయన్ను పిచ్చి ఆసుపత్రిలో వేయాలని విమర్శించారు.

Updated Date - 2023-05-03T17:38:29+05:30 IST