కాకర్ల విషయంలో బిత్తరపోయే విషయాలు.. ఇవే..!

ABN , First Publish Date - 2023-01-26T16:23:14+05:30 IST

జయత్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్(జయ గ్రూప్స్) పేరిట రియల్ ఎస్టేట్ మోసానికి కాకర్ల శ్రీనివాస్ (Kakarla Srinivas) పాల్పడ్డారు.

కాకర్ల విషయంలో బిత్తరపోయే విషయాలు.. ఇవే..!

హైదరాబాద్: జయత్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్(జయ గ్రూప్స్) పేరిట రియల్ ఎస్టేట్ మోసానికి కాకర్ల శ్రీనివాస్ (Kakarla Srinivas) పాల్పడ్డారు. బాధితుల నుంచి రూ.20 కోట్లు వసూలు చేసినట్లు పోలీసులు (TS Police) గుర్తించారు. కాకర్ల అరెస్ట్తో మరికొందరు బాధితులు వెలుగులోకి వస్తున్నారు. కేపీహెచ్బీ 6వ ఫేజ్లోని జయగ్రూప్ కార్యాలయానికి బాధితులు చేరుకున్నారు. ఏపీ నుంచి వచ్చి హైదరాబాద్ (Hyderabad) లో కాకర్ల సెటిల్ అయ్యారని పోలీసులు వెల్లడించారు. మొదట్లో KS ఇన్ఫ్రా పేరుతో ఆఫీస్ తెరిచారని, ప్రీ లాంచ్ పేరుతో బాధితులకు కుచ్చుటోపీ పెట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. Ks ఇన్ఫ్రా కేసులో కాకర్లను అరెస్ట్ అయ్యారని, బయటకు వచ్చి జయ (Jaya) ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో మరో సంస్థ ఏర్పాటు చేసినట్లు వారు వెల్లడించారు. జయ ఇన్ఫ్రా పేరుతో టెలికాలర్స్ను నియమించుకుని అమాయకులను ట్రాప్ చేయడమే లక్ష్యంగా మోసాలకు పాల్పడుతున్నట్లు, తెలంగాణలో భారీ ప్రాజెక్టులు ఉన్నాయంటూ మోసం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రీ లాంచ్ పేరుతో డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు.

Updated Date - 2023-01-26T16:23:17+05:30 IST