కొడుకు కనిపించడం లేదంటూ అడిషనల్ డీజీపీని కలిసిన కేసీఆర్ సోదరుడి కూతురు
ABN , First Publish Date - 2023-02-04T17:01:16+05:30 IST
అడిషనల్ డీజీపీని కేసీఆర్ సోదరుడి కూతురు రమ్యరావు కలిశారు. తన కొడుకు రితీష్ కనిపించడం లేదంటూ అడిషనల్ డీజీపీకి ఆమె ఫిర్యాదు చేశారు. ‘

హైదరాబాద్: అడిషనల్ డీజీపీని కేసీఆర్ సోదరుడి కూతురు రమ్యరావు కలిశారు. తన కొడుకు రితీష్ కనిపించడం లేదంటూ అడిషనల్ డీజీపీకి ఆమె ఫిర్యాదు చేశారు. ‘‘నిన్న పోలీస్ అభ్యర్థులకు మద్దతుగా రితీష్ ఆందోళనలో పాల్గొన్నారు. హోంమంత్రి కొడుకుకి ఓ న్యాయం.. నా బిడ్డకు ఒక న్యాయమా?, నిన్న పోలీసులు మా ఇంటిని అర్థరాత్రి తనిఖీ చేశారు, అసభ్యంగా మాట్లాడారు, నా కొడుకు ఇంట్లో లేడన్నా పట్టించుకోకుండా తనిఖీలు చేశారు, బంజారాహిల్స్ పోలీసులు క్షమాపణ చెప్పాలి’’ అని రమ్యరావు పేర్కొన్నారు.
అసలేం జరిగింది..?
రాష్ట్రంలోని వివిధ సమస్యలను పరిష్కరించాలని ఎన్ఎస్ యూఐ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. దీంతో ఎన్ఎస్ యూఐ ముఖ్య నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే.. అరెస్ట్ అయిన వాళ్లు ఎక్కడ ఉన్నారనేది తల్లిదండ్రులకు తెలియకుండా పోలీసులు గోప్యంగా ఉంచారు. వారిలో రమ్య రావు కుమారుడు రితేష్ రావు కూడా ఉన్నారు.