Share News

TS News: అయ్యప్పమాల వేస్తే నో ఎంట్రీ.. ప్రైవేటు స్కూల్ యాజమాన్యం అత్యుత్సాహం

ABN , First Publish Date - 2023-12-11T11:16:39+05:30 IST

Telangana: జిల్లాలోని బండ్లగూడలో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం అత్యుత్సాహం ప్రదర్శించింది.

TS News: అయ్యప్పమాల వేస్తే నో ఎంట్రీ.. ప్రైవేటు స్కూల్ యాజమాన్యం అత్యుత్సాహం

రంగారెడ్డి: జిల్లాలోని బండ్లగూడలో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం అత్యుత్సాహం ప్రదర్శించింది. అయ్యప్ప మాల వేసుకుంటే స్కూల్ లోకి నో ఎంట్రీ అని.. స్కూల్ డ్రెస్ ఉంటేనే స్కూల్‌‌లోకి అనుమతి అంటూ ఓ చిన్నారిని యాజమాన్యం బయటకు తోసేసింది. దీంతో ఆ చిన్నారి గంట పాటు ఎండలోనే నిలబడ్డాడు. ఈ విషయంపై చిన్నారి తండ్రికి యాజమాన్యం సమాచారం ఇవ్వగా.. యాజమాన్యం తీరుపై తండ్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎందుకు రానివ్వరో చెప్పండి అంటూ స్కూల్ యాజమాన్యాన్ని తండ్రి నిలదీశారు. మొబైల్ ఫోన్‌లో రికార్డ్ చేయడానికి స్వామి యత్నించగా... ఈ రికార్డింగ్‌లు స్కూల్‌లో చెల్లవంటూ యాజమాన్యం బెదిరింపులు దిగింది. దీంతో విద్యార్థి తండ్రి స్వామి స్కూల్ ఎదుట ఆందోళనకు దిగాడు.

Updated Date - 2023-12-11T15:24:55+05:30 IST