Rahul Gandhi: ఫేస్‌బుక్‌లో రాహుల్ గాంధీ ఆసక్తికర పోస్ట్.. తెలంగాణలో..
ABN , First Publish Date - 2023-06-26T22:11:51+05:30 IST
తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనాయకులు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు భేటీ అనంతరం ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. కర్నాటక తరహాలో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని దీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రజా కేంద్రక రాజకీయాలు తెలంగాణను స్వీప్ చేస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఐక్యంగా ఉన్న కాంగ్రెస్‌ను ఎవరు ఆపలేరని అన్నారు. ఈ మేరకు ఆయన ఫేస్‌బుక్‌లో ఆసక్తికర పోస్ట్ పెట్టారు.
ఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనాయకులు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు భేటీ అనంతరం ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. కర్నాటక తరహాలో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని దీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రజా కేంద్రక రాజకీయాలు తెలంగాణను స్వీప్ చేస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఐక్యంగా ఉన్న కాంగ్రెస్‌ను ఎవరు ఆపలేరని అన్నారు. ఈ మేరకు ఆయన ఫేస్‌బుక్‌లో ఆసక్తికర పోస్ట్ పెట్టారు.

రాహుల్‌తో ముగిసిన పొంగులేటి, జూపల్లి భేటీ..
తెలంగాణ రాజకీయ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul gandhi)తో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti srinivas reddy), మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు (jupally krishnarao)ల భేటీ సోమవారం ముగిసింది. వారివురూ ఢిల్లీలో అరగంటకుపైగా రాహుల్‌తో చర్చించారు. జులై 2న ఖమ్మం రావాలని రాహుల్‌ని పొంగులేటి ఆహ్వానించారు. దీంతో ఆ రోజు ఖమ్మంలో జరిగే సభలో రాహుల్ సమక్షంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణా రావు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకోనున్నారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. నేతలు తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావడం ఆనందంగా ఉందని వ్యాఖ్యానించారు. కాగా ‘కేసీఆర్ హఠావో.. తెలంగాణ బచావో’ నినాదంతో ముందుకు సాగాలని తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులకు రాహుల్ సూచించారు. తెలంగాణ నేతలతో రాహుల్ భేటీ సందర్భంగా ఫొటో సెషన్ ఏర్పాటు చేశారు. నేతలంతా గ్రూప్ ఫొటో దిగిన అనంతరం రాహుల్‌తో కలిసి పొంగులేటి మరోసారి ఏఐసీసీ కార్యాలయంలోకి వెళ్లారు. ఈ కార్యక్రమానికి పొంగులేటి, జూపల్లి అనుచరులు పెద్ద ఎత్తున తరలివచ్చిన విషయం తెలిసిందే.