Share News

Pavan Kalyan: 26న కూకట్‌పల్లికి పవన్‌కల్యాణ్‌

ABN , First Publish Date - 2023-11-19T10:49:12+05:30 IST

జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌(Pavan Kalyan) ఈనెల 26న కూకట్‌పల్లికి రానున్నారు. కూకట్‌పల్లిలో ఏర్పాటు చేసిన

Pavan Kalyan: 26న కూకట్‌పల్లికి పవన్‌కల్యాణ్‌

హైదరాబాద్, (ఆంధ్రజ్యోతి): జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌(Pavan Kalyan) ఈనెల 26న కూకట్‌పల్లికి రానున్నారు. కూకట్‌పల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన పాల్గొంటారని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ) చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌(Nadendla Manohar) ప్రకటించారు. జనసేన పార్టీ అభ్యర్థి ప్రేమ్‌కుమార్‌కి మద్ధతుగా ఐటీ ఉద్యోగులు కేపీహెచ్‌బీ(KPHB)లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి నాందేడ్ల మనోహర్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. త్వరలోనే బీజేపీ ముఖ్యనేతలతో కలిసి మరొక సభలో కూడా పవన్‌కల్యాణ్‌ పాల్గొనే అవకాశం ఉందన్నారు.

టీడీపీ తప్పుకున్నందునే..

తెలంగాణ ఎన్నికల్లో పోటీ నుంచి వైఎస్సార్‌సీపీ, తెలుగుదేశం పార్టీలు విరమించుకున్నందునే జనసేన పార్టీ పోటీ చేయాల్సిన అవసరమేర్పడిందని ఆయన అన్నారు. తెలంగాణలో ఉంటున్న ఆంధ్ర, రాయలసీమ ప్రాంత ప్రజల హక్కులను కాపాడాలంటే కూకట్‌పల్లిలో జనసేన అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్‌కుమార్‌ను గెలిపించాలని నాదెండ్ల మనోహర్‌ కోరారు. కూకట్‌పల్లిలో త్వరలోనే జనసేన పార్టీ కార్యాలయం ఏర్పాటు చేస్తామన్నారు. నియోజకవర్గ ప్రజలకు జనసేన పార్టీ గుర్తును చేరువ చేసేందుకు త్వరలోనే 40వేల గాజు గ్లాసులను పంపుతామన్నారు. బొలిశెట్టి శ్రీనివాస్‌, రాజలింగం, హరిప్రసాద్‌, కల్యాణం శ్రీనివాస్‌, పాల్గొన్నారు.

Updated Date - 2023-11-19T10:49:14+05:30 IST