Sabita Indra Reddy: కేసీఆర్ ఆశీర్వాదంతో పాఠశాలల రూపురేఖలు మారాయి

ABN , First Publish Date - 2023-08-21T15:54:25+05:30 IST

టాలెంట్ ఎవరి సొత్తు కాదు. విద్యార్థులు బాగా చదువుకుని గొప్పగా ఎదగాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేజీ (KG) టూ పీజీ (PG) వరకు విద్యను అందిస్తుంది. 2014- 15లో రూ.9000 కోట్ల బడ్జెట్ విద్యా వ్యవస్థకు కేటాయిస్తే ఇప్పుడది రూ.29000 కోట్లకు పెరిగింది. రాష్ట్రంలో 1571 గురుకులాలను అప్ గ్రేడ్ చేశాం.

Sabita Indra Reddy: కేసీఆర్ ఆశీర్వాదంతో పాఠశాలల రూపురేఖలు మారాయి

కామారెడ్డి: సీఎం కేసీఆర్ (CM Kcr) ఆశీర్వాదంతో పాఠశాలల రూపురేఖలు మారిపోయాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Sabita Indra Reddy) తెలిపారు. పెద్ద కొడపగల్ మండల కేంద్రంలో మంత్రి మాట్లాడారు. ‘‘టాలెంట్ ఎవరి సొత్తు కాదు. విద్యార్థులు బాగా చదువుకుని గొప్పగా ఎదగాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేజీ (KG) టూ పీజీ (PG) వరకు విద్యను అందిస్తుంది. 2014- 15లో రూ.9000 కోట్ల బడ్జెట్ విద్యా వ్యవస్థకు కేటాయిస్తే ఇప్పుడది రూ.29000 కోట్లకు పెరిగింది. రాష్ట్రంలో 1571 గురుకులాలను అప్ గ్రేడ్ చేశాం. మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా 2600 స్కూళ్లను రూ.7000 కోట్లతో అభివృద్ధి చేసుకుంటున్నాం. రూ.190 కోట్ల వ్యయంతో విద్యార్థులకు నాణ్యమైన పాఠ్యపుస్తకాల పంపిణీ చేశాం. రూ.100 కోట్లతో నోట్ బుక్‌లు, వర్క్‌షీట్‌ల పంపిణీ. స్కుళ్లను బాగు చేసుకున్నాం. ఆ స్కూళ్లను కాపాడుకోవాల్సిన బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులు తీసుకోవాలి. పెద్ద కొడపగల్‌కు జూనియర్ కాలేజీ ప్రపోజల్ పంపుతాం. మరో మూడు అదనపు గదులకు, పాఠశాల గ్రౌండ్ అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తాం. మధ్యాహ్న భోజనంతో పాటు విద్యార్థులకు వారంలో మూడు రోజులు రాగి జావా బ్రేక్ ఫాస్ట్‌ను అందిస్తున్నాం. 6000 మంది విద్యార్థులకు విదేశాల్లో విద్యను అభ్యసించడానికి ఓవర్ సీస్ స్కాలర్ షిప్‌లు అందించాం.’’ అని మంత్రి పేర్కొన్నారు.

Updated Date - 2023-08-21T15:54:25+05:30 IST