Kamareddy Dist.: క్రెడిట్ కార్డ్ యాక్టివేషన్ పేరిట న్యాయవాదికి కుచ్చుటోపి..
ABN , First Publish Date - 2023-05-26T10:58:25+05:30 IST
క్రెడిట్ కార్డ్ యాక్టివేషన్ పేరిట న్యాయవాదికి సైబర్ కేటుగాళ్లు కుచ్చుటోపి పెట్టారు. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన వెంకటరత్నం అనే న్యాయవాదికి ఎస్‌బీఐ బ్యాంకు నుంచి మాట్లాడుతున్నామని

Kamareddy Dist.: క్రెడిట్ కార్డ్ (Credit Card) యాక్టివేషన్ పేరిట న్యాయవాదికి సైబర్ కేటుగాళ్లు (Cyber Threats) కుచ్చుటోపి పెట్టారు. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన వెంకటరత్నం అనే న్యాయవాదికి ఎస్‌బీఐ (SBI) బ్యాంకు నుంచి మాట్లాడుతున్నామని, క్రెడిట్ కార్డ్ యాక్టివేషన్ చేయాలంటూ సైబర్ నేరగాళ్ళు ఫోన్ కాల్ చేశారు. వెంకటరత్నం మొబైల్ నెంబర్‌కు సైబర్ కేటుగాళ్లు ఓటీపీ పంపారు. దీంతో తిరిగి ఓటీపీని బాధితుడు వెంకటరత్నం అవతలి వ్యక్తికి పంపారు. అనంతరం వెంకటరత్నం బ్యాంక్ అకౌంట్ నుంచి రూ. 33,500 డెబిట్ అయినట్లుగా మొబైల్‌కు మెసేజ్ వచ్చింది. దీంతో మోసపోయానని గ్రహించిన వెంకటరత్నం స్థానిక కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.