Nirmal Dist.: జింక మాంసం పేరుతో ఘరానా మోసం..

ABN , First Publish Date - 2023-06-09T16:44:56+05:30 IST

నిర్మల్ జిల్లా: కేటుగాళ్లు కొత్త పద్ధతిలో ప్రజలను బురిడి కొట్టిస్తున్నారు. ఇందు కోసం ఎంతకైనా దిగజారుతున్నారు. నిర్మల్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కుక్కను చంపి.. జింక మాంసమంటూ విక్రయించడం స్థానికంగా కలకలం రేగింది.

Nirmal Dist.: జింక మాంసం పేరుతో ఘరానా మోసం..

నిర్మల్ జిల్లా: కేటుగాళ్లు కొత్త పద్ధతిలో ప్రజలను బురిడి కొట్టిస్తున్నారు. ఇందు కోసం ఎంతకైనా దిగజారుతున్నారు. నిర్మల్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కుక్కను చంపి.. జింక మాంసమంటూ విక్రయించడం స్థానికంగా కలకలం రేగింది. మేక మాంసం అయితే గుర్తుపడతారు. గుర్రె మాంసం అయితే తెలిసిపోతుంది. ఇంకేదైనా కొత్త జంతువు అయితే జనాలను బోల్తా కొట్టించవచ్చునని ఇద్దరు మోసగాళ్లు అనుకున్నారు. అప్పుడే వారి కన్ను కుక్కపై పడింది. వీధి కుక్క కంటే పెంపుడు కుక్క అయితే బెటర్ అనుకున్నారు. ఇంకేం పెంపుడు కుక్కను దొంగిలించారు. లక్ష్మణ్‌చందానగర్‌లో ఈ దారుణం చోటు చేసుకుంది.

ఆనంద్ అనే వ్యక్తి పెంచుకుంటున్న కుక్కను పొట్టెపల్లె గ్రామానికి చెందిన శ్రీనివాస్, వరుణ్ దొంగిలించారు. గుట్టుచప్పుడు కాకుండా చంపేశారు. పథకం పేరుతో చుట్టుపక్కల గ్రామాల్లో జింక మాంసం అని చెప్పి అమ్మారు. చుట్టూ అడవులు ఉండే సరికి నిజంగానే జింక మాంసం అనుకుని చాలా మంది కొనుక్కున్నారు. అయితే కుక్క యజమాని ఫిర్యాదుతో వారి బాగోతం బయటపడింది. పోలీసులు సీసీ కెమెరాను పరిశీలించి ఇద్దరు వ్యక్తులు కుక్కను అపహరించినట్లు గుర్తించారు, నిందితులను పట్టుకుని విచారణ చేపట్టారు. మరోవైపు కుక్క మాంసం తిన్నవాళ్లంతా తీవ్ర భయాందోళనకు గురౌతున్నారు. పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు.

Updated Date - 2023-06-09T16:44:56+05:30 IST