Shabbir Ali: డబుల్ బెడ్రూం ఇళ్లపై షబ్బీర్ అలీ హాట్ కామెంట్స్
ABN , First Publish Date - 2023-06-19T16:09:58+05:30 IST
డబుల్ బెడ్రూం ఇళ్లు ఎప్పుడు కూలిపోతాయో తెలియడం లేదని వాపోయారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వీటిని పడగొట్టి కొత్త నిర్మాణాలు చేపడతామన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాల్లో బీఆర్ఎస్ నేతలు 30 శాతం కమీషన్లు తీసుకున్నారని
కామారెడ్డి: డబుల్ బెడ్రూం ఇళ్ల విషయంలో కేసీఆర్ ప్రభుత్వం (KCR Government) ఫెయిల్ అయిందని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీ (Shabbir Ali) ఆరోపించారు. టెక్రియల్ డబుల్ బెడ్రూం ఇళ్ల దగ్గర కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘కామారెడ్డిలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లల్లో నాణ్యత లేదని చెప్పుకొచ్చారు. ఇక లబ్దిదారుల ఎంపిక జరగముందే నిర్మాణాలు శిథిలావస్థకు చేరాయని తెలిపారు. 50 ఏళ్ల నాణ్యత ఉందని ఎమ్మెల్యే అంటున్నారని.. అదే నిజమైతే ఎమ్మెల్యే గంప ఈ బెడ్రూమ్‌లో 50 రోజులు ఉండాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే గంప వస్తే నాణ్యత లేదని తాను చేసిన ఆరోపణలు రుజువు చేస్తానని సవాల్ విసిరారు. నాసిరకం నిర్మాణాల్లో ఉండేందుకు లబ్దిదారులు ముందుకు రావటం లేదని పేర్కొన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లు ఎప్పుడు కూలిపోతాయో తెలియడం లేదని వాపోయారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వీటిని పడగొట్టి కొత్త నిర్మాణాలు చేపడతామన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాల్లో బీఆర్ఎస్ నేతలు 30 శాతం కమీషన్లు తీసుకున్నారని షబ్బీర్ అలీ ఆరోపించారు.