Share News

TS NEWS: ఆన్‌లైన్ గేమ్స్‌కి బానిసై.. సెల్ఫీ వీడియోతో ఆత్మహత్య

ABN , Publish Date - Dec 18 , 2023 | 10:07 PM

ఆన్ లైన్‌లో గేమ్స్ ఆడుతూ అప్పులపాలైన ఓ యువకుడు అవి తీర్చలేక ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన భువనగిరి మండలం బండ సోమరం గ్రామంలో చోటు చేసుకుంది.

TS NEWS: ఆన్‌లైన్ గేమ్స్‌కి బానిసై.. సెల్ఫీ వీడియోతో ఆత్మహత్య

యాదాద్రి: ఆన్ లైన్‌లో గేమ్స్ ఆడుతూ అప్పులపాలైన ఓ యువకుడు అవి తీర్చలేక ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన భువనగిరి మండలం బండ సోమరం గ్రామంలో చోటు చేసుకుంది.భువనగిరి మండలం బండ సోమరం గ్రామానికి చెందిన చిరుకూరి ప్రసాద్ (35) ఆత్మహత్య చేసుకుంటానని సెల్ఫీ వీడియో బండ సోమరానికి చెందిన చిరుకూరి ప్రసాద్(35) ఆన్‌లైన్ గేమ్స్‌ ఆడుతూ డబ్బులు పోగొట్టుకున్నాడు. దాదాపు పెద్దమొత్తంలో నగదును నష్టపోయాడు. దీంతో యువకుడి తండ్రి మందలిచ్చాడు. దీంతో చేసిన అప్పులు తీర్చలేని పరిస్థితుల్లో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యకు పాల్పడుతానని సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రసాద్ సెల్ స్విచ్ఛాఫ్ కావడంతో గ్రామస్తులు, బంధువులు సమీప ప్రాంతాల్లో యువకుడి కోసం వెతుకుతున్నారు.

Updated Date - Dec 18 , 2023 | 10:07 PM