Harish Rao: సిద్ధిపేటలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు..పాల్గొన్న హరీష్‌రావు

ABN , First Publish Date - 2023-06-02T09:25:56+05:30 IST

సిద్దిపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. దశాబ్ది తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా మంత్రి క్యాంపు కార్యాలయంలో హరీష్‌రావు పోలీసు గౌరవ వందనం స్వీకరించారు.

Harish Rao: సిద్ధిపేటలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు..పాల్గొన్న హరీష్‌రావు

సిద్ధిపేట: సిద్దిపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. దశాబ్ది తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా మంత్రి క్యాంపు కార్యాలయంలో హరీష్‌రావు (Minister Harish Rao) పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీయ జెండా ఆవిష్కరించారు. అంతుకుముందు సిద్ధిపేట రంగదాంపల్లి అమరవీరుల స్థూపం వద్ద పూలమాలలు వేసి అమరులను స్మరిస్తూ ఘనంగా నివాళులు అర్పించారు. ఆపై ముస్తాబాద్ సర్కిల్ లోని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో సెంట్రల్ వేడుకల్లో భాగంగా పోలీస్ గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పదేళ్ల జిల్లా ప్రగతి నివేదికను మంత్రి హరీష్‌రావు వివరించారు.

Updated Date - 2023-06-02T09:25:56+05:30 IST