Minister Talasani: 70 ఏండ్లలో జరగని అభివృద్ధి 9 ఏళ్లలో జరిగింది...

ABN , First Publish Date - 2023-06-02T10:37:20+05:30 IST

మెదక్ జిల్లా: మెదక్ కలెక్టరేట్‌లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. జాతీయ జెండా అవిష్కరణతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వేడుకలు ప్రారంభించారు.

Minister Talasani: 70 ఏండ్లలో జరగని అభివృద్ధి 9 ఏళ్లలో జరిగింది...

మెదక్ జిల్లా: మెదక్ కలెక్టరేట్‌లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. జాతీయ జెండా అవిష్కరణతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వేడుకలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, మదన్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ హేమలత శేఖర్ గౌడ్, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ రోహిణి ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని అమరవీరుల కుటుంబాలను సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేయడమే లక్ష్యమన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో సంక్షేమ పథకాలు అమలుపరిస్తూ దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోందన్నారు.

తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తోందని చెప్పుకునే స్థాయికి ఎదగడం గర్వకారణంగా ఉందని మంత్రి తలసాని అన్నారు. 70 ఏండ్లలో జరగని అభివృద్ధి 9 ఏళ్లలో జరిగిందన్నారు. దేశానికి తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తూ.. అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతున్నామన్నారు. వ్యవసాయానికి ప్రతీకగా తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. కాళేశ్వరం నీళ్లతో మెదక్ జిల్లా సస్యశ్యామలం అవుతోందని... కేసీఆర్ ఆలోచనతో రైతు బంధు పథకం ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు పొందిందని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-06-02T10:37:20+05:30 IST