Ponnam Prabhakar: అందుకే ఓటు హక్కును హుస్నాబాద్‌కు మార్చుకున్నా

ABN , First Publish Date - 2023-09-12T14:58:03+05:30 IST

హుస్నాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉంటున్న సందర్భంగా స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో తన నివాసాన్ని, ఓటు హక్కును కరీంనగర్ నుంచి హుస్నాబాద్‌కు మార్చుకున్నట్లు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తెలిపారు.

Ponnam Prabhakar: అందుకే ఓటు హక్కును హుస్నాబాద్‌కు మార్చుకున్నా

సిద్దిపేట: హుస్నాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉంటున్న సందర్భంగా స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో తన నివాసాన్ని, ఓటు హక్కును కరీంనగర్ నుంచి హుస్నాబాద్‌కు మార్చుకున్నట్లు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ (Former MP Ponnam PRabhakar) తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. పదేండ్ల కాలంలో హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి ఏం చేశారో ముందు రేపు జరగబోయే ఆ పార్టీ కార్యకర్తల సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే సతీష్ కుమార్ చెప్పాలని డిమాండ్ చేశారు. గౌరవెల్లి ప్రాజెక్టు శంకుస్థాపన చేసి 70% పనులు పూర్తి చేసిన తాము గొప్పో లేక ప్రాజెక్టు పనులు పూర్తి చేయడానికి పది సంవత్సరాల సమయం తీసుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పదో రైతులు ఆలోచించాలన్నారు. సిద్దిపేట జిల్లాలోని కోమటి చెరువు కంటే అద్భుతంగా ఉన్న హుస్నాబాద్‌లోని ఎల్లమ్మ చెరువును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయకుండా స్థానిక ఎమ్మెల్యే నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ కార్యకర్తలు నిర్లక్ష్యానికి గురయ్యారని.. బీఆర్ఎస్ కార్యకర్తలు ఆలోచించాలని పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2023-09-12T14:58:03+05:30 IST