Minister Satyavati Rathod: అంగన్వాడీలకు జీతాలు పెంచిన ఘనత కేసీఆర్‌దే..‌

ABN , First Publish Date - 2023-09-11T16:15:44+05:30 IST

తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) వచ్చాక మూడుసార్లు అంగన్వాడీల జీతాలు పెంచిన ఘనత కేసీఆర్‌(KCR)దని మంత్రి సత్యవతి రాథోడ్(Minister Satyavati Rathod) వ్యాఖ్యానించారు.

Minister Satyavati Rathod: అంగన్వాడీలకు జీతాలు పెంచిన ఘనత కేసీఆర్‌దే..‌

మహబూబ్‌నగర్ జిల్లా: తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) వచ్చాక మూడుసార్లు అంగన్వాడీల జీతాలు పెంచిన ఘనత కేసీఆర్‌(KCR)దని మంత్రి సత్యవతి రాథోడ్(Minister Satyavati Rathod) వ్యాఖ్యానించారు. సోమవారం నాడు జడ్చర్ల మండలం మాచారం సమీపంలో ఏర్పాటు చేసిన గిరిజన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు సత్యవతి రాథోడ్, శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ మన్నే శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. అంగన్వాడీలను టీచర్లుగా గుర్తించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదని.. వారికి ఆసరా పెన్షన్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకున్నామని చెప్పారు. కొన్ని సంఘాలు అంగన్వాడీలను రెచ్చగొట్టి సమ్మెబాట పట్టించాయని... వారు వెంటనే విరమించుకోవాలని మంత్రి సత్యవతి రాథోడ్ కోరారు.

Updated Date - 2023-09-11T16:15:44+05:30 IST