Share News

Revanth Reddy: ఆరు నియోజకవర్గాల్లో నేడు రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం

ABN , First Publish Date - 2023-11-26T09:11:18+05:30 IST

హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల పోలింగ్‌కు ఇంకా నాలుగు రోజులే సమయమండడంతో ప్రధాన పార్టీల అగ్ర నేతలు ప్రచారం ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆదివారం ఆయా నియోజక వర్గాల్లో పర్యటించి ప్రచారం నిర్వహించనున్నారు.

Revanth Reddy: ఆరు నియోజకవర్గాల్లో నేడు రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం

హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల పోలింగ్‌కు ఇంకా నాలుగు రోజులే సమయమండడంతో ప్రధాన పార్టీల అగ్ర నేతలు ప్రచారం ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆదివారం ఆయా నియోజక వర్గాల్లో పర్యటించి ప్రచారం నిర్వహించనున్నారు. నారాయణపేట్, దేవరకద్ర, మహబూబ్ నగర్, కామారెడ్డి, పఠాన్ చెరు, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో ప్రచార సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు.

టూర్ షెడ్యూల్..

ఆదివారం ఉదయం 10 గంటలకు నారాయణపేట్ బహిరంగ సభ, 11 గంటలకు దేవరకద్ర బహిరంగ సభ, మధ్యాహ్నం 12 గంటలకు మహబూబ్ నగర్ జనసభ. 2 గంటలకు రాహుల్ గాంధీతో కలిసి కామారెడ్డి బహిరంగ సభ.. సాయంత్రం 5.30 గంటలకు పఠాన్ చెరు జనసభ, 6.30 గంటలకు శేరిలింగంపల్లి సభలో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.

Updated Date - 2023-11-26T09:11:20+05:30 IST