Deekshith Reddy Case: బాలుడు దీక్షిత్ రెడ్డి హత్య కేసులో జిల్లా కోర్టు సంచలన తీర్పు..
ABN , First Publish Date - 2023-09-29T13:31:43+05:30 IST
మూడేళ్ల క్రితం మహబూబాబాద్‌లో సంచలనం సృష్టించిన బాలుడు దీక్షిత్ రెడ్డి కిడ్నాప్, హత్య కేసులో సంచలన తీర్పు వెలువడింది. నిందితుడు మందసాగర్ దోషిగా తేలడంతో మరణశిక్ష విధిస్తూ మహబూబాబాద్ జిల్లా తీర్పునిచ్చింది.
మహబూబాబాద్: మూడేళ్ల క్రితం మహబూబాబాద్‌లో సంచలనం సృష్టించిన బాలుడు దీక్షిత్ రెడ్డి కిడ్నాప్, హత్య కేసులో సంచలన తీర్పు వెలువడింది. నిందితుడు మందసాగర్ దోషిగా తేలడంతో మరణశిక్ష విధిస్తూ మహబూబాబాద్ జిల్లా తీర్పునిచ్చింది. ఈ మేరకు జిల్లా ప్రధాన జడ్జి పసుపులేటి చంద్రశేఖర్ ప్రసాద్ తీర్పు వెలువరించారు. కాగా దోషి మందసాగర్ మూడేళ్లక్రితం తాళ్లపూసపళ్లి శివారు దానమయ్య గుట్టలో కుసుమ దీక్షిత్ రెడ్డిని అతి కిరాతకంగా హత్య చేశాడు. 2020 అక్టోబర్ 18న కిడ్నాప్, హత్య జరిగాయి. జిల్లా కోర్టు ఇచ్చిన ఈ తీర్పుతో బాధిత కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.