Kukatpally: కూకట్‌పల్లి ‘కాంగ్రెస్‌’ ఇన్‌చార్జిగా బండి రమేష్‌

ABN , First Publish Date - 2023-12-20T13:18:47+05:30 IST

కాంగ్రెస్‌ పార్టీ కూకట్‌పల్లి(Kukatpally) నియోజకవర్గ ఇన్‌చార్జిగా బండి రమేష్‌(Bandi Ramesh) కొనసాగుతారని అధిష్ఠానం ప్రకటించింది.

Kukatpally: కూకట్‌పల్లి ‘కాంగ్రెస్‌’ ఇన్‌చార్జిగా బండి రమేష్‌

కూకట్‌పల్లి(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ పార్టీ కూకట్‌పల్లి(Kukatpally) నియోజకవర్గ ఇన్‌చార్జిగా బండి రమేష్‌(Bandi Ramesh) కొనసాగుతారని అధిష్ఠానం ప్రకటించింది. ఎన్నికల్లో పోటీచేసి బీ-ఫాం తీసుకున్న అభ్యర్థులను నియోజకవర్గాల ఇన్‌చార్జిలుగా నియమిస్తూ పార్టీ తీసుకున్న నిర్ణయంపై రమేష్‌ హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Chief Minister Revanth Reddy), పార్టీ అగ్రనాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. సంక్షేమ పథకాలు అర్హులైన అందరికీ అందేలా కృషి చేస్తానన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ప్రభుత్వానికి సూచనలు చేస్తానని, ప్రజా సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు.

పోచమ్మ ఆలయంలో పూజలు

ఫతేనగర్‌ పోచమ్మ ఆలయ వార్షికోత్సవంలో భాగంగా మంగళవారం నిర్వహించిన ప్రత్యేక పూజల్లో బండి రమేష్‌, బీఆర్‌ఎస్‌ నాయకుడు గొట్టిముక్కల వెంగళరావు పాల్గొన్నారు. నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు కె.రాజు ముదిరాజ్‌, కంచి మహేందర్‌, రమే్‌షబాబు, చిట్టిబాబు, రాజుపటేల్‌, అనిల్‌, నర్సింగ్‌ పాల్గొన్నారు.

city7.2.jpg

Updated Date - 2023-12-20T13:18:48+05:30 IST