Congress leaders: కోమటిరెడ్డి, సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-06-26T19:41:03+05:30 IST

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వెళ్లిపోయిన వాళ్లని మళ్లీ పార్టీలోకి ఆహ్వానించామని కోమటిరెడ్డి అన్నారు. ఈసారి తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు.

Congress leaders: కోమటిరెడ్డి, సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వెళ్లిపోయిన వాళ్లని మళ్లీ పార్టీలోకి ఆహ్వానించామని కోమటిరెడ్డి అన్నారు. ఈసారి తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. కేసీఆర్‌లా హామీలు ఇచ్చి కాంగ్రెస్ విస్మరించబోదని చెప్పారు. తాము చేసేవి చెబుతాం.. చెప్పినవి చేస్తామని చెప్పారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ రెండూ ఒకటేనని, ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదన్నారు. మహారాష్ట్రలో కేసీఆర్‌ బీజేపీని తిట్టడం లేదు, అధికారంలో లేని కాంగ్రెస్‌ పార్టీని తిడుతున్నారని కోమటిరెడ్డి మండిపడ్డారు.

చిన్నచిన్న విభేదాలు సహజం: ఎమ్మెల్యే సీతక్క

పార్టీలో నేతల మధ్య చిన్నచిన్న విభేదాలు ఉండడం సహజమని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే సీతక్క అన్నారు. తెలంగాణ ప్రజల కోసం అందరం ఐక్యంగా పనిచేస్తామని తెలిపారు. పార్టీలోకి ఇప్పుడు వచ్చేవాళ్లే ఉన్నారు.. ఇక పోయేవాళ్లు ఉండరని దీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో కోవర్టులు ఎవరూ లేరని అన్నారు. కాంగ్రెస్‌కు ఒక్క అవకాశం ఇవ్వండని ప్రజలను కోరారు. రాష్ట్రంలో బీజేపీ, బీఆర్‌ఎస్‌ కుమ్మక్కయ్యాయని అన్నారు. ఈ మేరకు ఇద్దరూ ఢిల్లీలో మాట్లాడారు.

Updated Date - 2023-06-26T19:41:03+05:30 IST