Share News

Nalgonda: నన్ను ఓడించాలని ఆ రెండు పార్టీలు చూస్తున్నాయ్.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపణలు

ABN , First Publish Date - 2023-11-05T16:01:02+05:30 IST

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఓడించాలని బీఆర్ఎస్(BRS), బీజేపీ(BJP) చూస్తున్నాయని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy) ఆరోపించారు.

Nalgonda: నన్ను ఓడించాలని ఆ రెండు పార్టీలు చూస్తున్నాయ్.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపణలు

నల్గొండ: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఓడించాలని బీఆర్ఎస్(BRS), బీజేపీ(BJP) చూస్తున్నాయని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy) ఆరోపించారు. మునుగోడులు ఇవాళ ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్, బీజేపీ ఎప్పుడో ఒకటయ్యాయని అన్నారు. వాళ్లు కుమ్మక్కయి కాంగ్రెస్ ని(Congress) రాజకీయంగా దెబ్బ కొట్టాలని చూస్తున్నారన్నారు. ప్రజలు వారి మోసాలను గమనిస్తున్నారని ఎట్టి పరిస్థితుల్లో అది జరిగే పని కాదన్నారు. కాంగ్రెస్ టిక్కెట్ ఆశించి భంగపడ్డ చలమల్ల కృష్ణారెడ్డి పేరు నియోజకవర్గంలో ఎవరైనా విన్నారా అని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబ అవినీతిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షాని(Amithshah) నేరుగా కాంటాక్ట్ అయినా ఆయన నుంచి సమాధానం రాలేదన్నారు. అందుకే కల్వకుంట్ల కుటుంబంపై ఒక్క కేసు పెట్టలేదని ఆరోపించారు. రాష్ట్రంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని.. బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తామన్నారు. 90 సీట్లతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Updated Date - 2023-11-05T16:03:45+05:30 IST