Daba Fight: ఖమ్మం జిల్లాలో పరిస్థితి ఉద్రిక్తం.. ఓ దాబాలో ఘర్షణ.. వివాదానికి కారణమేంటంటే..?
ABN , First Publish Date - 2023-09-22T18:10:06+05:30 IST
ఖమ్మం జిల్లాలో(Khammam district ) ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఓ దాబాపై కొంతమంది వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘన స్థానికంగా కలకలం రేపింది.
ఖమ్మం: ఖమ్మం జిల్లాలో(Khammam district ) ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఓ దాబాపై కొంతమంది వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. కూసుమంచి మండలం జుజ్జులరావుపేట(Jujjularaopet) సమీప జాతీయ రహదారి పక్కన అన్నపూర్ణ దాబాలో కొంతమంది ఘర్షణకు దిగారు. దాబాలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేసి, వర్కర్లపై జుజ్జులరావుపేట గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు దాడి చేశారు. ఫుడ్ సప్లై విషయంలో దాబా యజమాని సాయికి జుజ్జులరావుపేటకు చెందిన ఉప్పలయ్యకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఇరువర్గాలు తీవ్రంగా ఘర్షణ పడ్డారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాబాపై దాడి చేసిన ఉప్పలయ్యపై కూసుమంచి పోలీసులకు దాబా యజమాని సాయి ఫిర్యాదు చేశారు.