TSPSC paper leak: కాలేజీల బంద్‌కు యూత్ కాంగ్రెస్ పిలుపు

ABN , First Publish Date - 2023-03-17T16:07:20+05:30 IST

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ (TSPSC paper leak) వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇదిలా ఉంటే రేపు (శనివారం) తెలంగాణ వ్యాప్తంగా కాలేజీల బంద్‌కు ఎన్‌ఎస్‌యూఐ (NSUI), యూత్ కాంగ్రెస్ (Youth Congress) పిలుపు నిచ్చాయి. తాజాగా

TSPSC paper leak: కాలేజీల బంద్‌కు యూత్ కాంగ్రెస్ పిలుపు
కాలేజీల బంద్‌కు యూత్ కాంగ్రెస్ పిలుపు

హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ (TSPSC paper leak) వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇదిలా ఉంటే రేపు (శనివారం) తెలంగాణ వ్యాప్తంగా కాలేజీల బంద్‌కు ఎన్‌ఎస్‌యూఐ (NSUI), యూత్ కాంగ్రెస్ (Youth Congress) పిలుపు నిచ్చాయి. తాజాగా ఎన్‌ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో టీఎస్‌పీఎస్సీ కార్యాలయం ముట్టడికి బయల్దేరారు. దీంతో గాంధీభవన్‌ గేట్లు మూసి బయటకు రాకుండా కార్యకర్తలను అడ్డుకున్నారు. అయిన కూడా గేట్లు దూకి బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. ఇదే వ్యవహారంపై ఆందోళనలకు పిలుపునిచ్చిన వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిలను గృహనిర్బంధం చేశారు. కానీ ఆ వేడి మాత్రం ఇంకా చల్లారలేదు. విపక్ష పార్టీలు మాత్రం ఈ వ్యవహారంపై టీఎస్‌పీఎస్సీ తీరును తీవ్రంగా తప్పుబడుతున్నాయి. అలాగే ఆందోళనలు కూడా ఉధృతం చేశాయి. ఈ కేసులో ఇప్పటికే నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

ఇదిలా ఉంటే తాజాగా గ్రూప్-1 ప్రిలిమ్స్‌ను కూడా టీఎస్‌పీఎస్సీ (TSPSC) రద్దు చేసింది. ఇప్పటికే ఏఈ పరీక్ష (AE Exam) తో పాటు టౌన్‌ ప్లానింగ్‌, వెటర్నరీ అసిస్టెంట్‌ ఎగ్జామ్‌ పేపర్లను రద్దు చేసింది. తాజాగా గ్రూప్-1 ప్రిలిమ్స్‌తో పాటు ఏఈఈ, డీఏవో పరీక్ష పేపర్లను కూడా రద్దు చేస్తూ టీఎస్‌పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. పేపర్ లీకేజీ వ్యవహారంపై తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. అలాగే ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నాయి.

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ను 2022, సెప్టెంబర్‌ 16న నిర్వహించారు. రద్దు చేసిన ఈ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ను జూన్‌ 11న నిర్వహించనున్నట్లు వెల్లడించింది. సిట్‌ నివేదిక ఆధారంగా ఈ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వెల్లడించింది. 2023, జనవరి 22న ఏఈఈ, ఫిబ్రవరి 26న డీఏవో పరీక్షలను నిర్వహించారు. త్వరలో జరగబోయే మరిన్ని పరీక్షలను కూడా వాయిదా వేసే యోచనలో టీఎస్‌పీఎస్సీ ఉన్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2023-03-17T16:07:20+05:30 IST