Minister KTR ట్విట్టర్ అకౌంట్‌‌కు ఏమైంది.. ఎందుకీ గందరగోళం.. ఇంకెన్ని రోజులో..!

ABN , First Publish Date - 2023-01-25T18:41:36+05:30 IST

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ అకౌంట్ (Twitter Account) హ్యాక్ అయ్యిందా.. లేదంటే మొత్తానికే మార్చేశారా..? ఉన్నట్టుండి అకౌంట్ నుంచి బ్లూ టిక్ మాయం కావడం వెనుక ఆంతర్యమేంటి..?

Minister KTR ట్విట్టర్ అకౌంట్‌‌కు ఏమైంది.. ఎందుకీ గందరగోళం.. ఇంకెన్ని రోజులో..!

ఆంధ్రజ్యోతి ఇంటర్నెట్ : తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ అకౌంట్ (Twitter Account) హ్యాక్ అయ్యిందా.. లేదంటే మొత్తానికే మార్చేశారా..? ఉన్నట్టుండి అకౌంట్ నుంచి బ్లూ టిక్ మాయం కావడం వెనుక ఆంతర్యమేంటి..? ఈ మొత్తం వ్యవహారంలో ఎవరి హస్తమైనా ఉందా.. ? లేకుంటే ఇంకేదైనా జరిగిందా..? కొన్ని గంటలుగా బీఆర్ఎస్ శ్రేణుల్లో నెలకొన్న ఈ గందరగోళానికి తెరదించేదెవరు..? అనే విషయాలపై ప్రత్యేక కథనం.

ప్రతిరోజూ వివాదమే..!

ఎలన్ మస్క్ (Elon Musk) ట్విట్టర్‌ను టేకోవర్ చేసుకున్న తర్వాత ఎప్పుడేం జరుగుతోందో ఎవరికీ అంతుపట్టడం లేదు. ట్విట్టర్ ఆఫీసులో అడుగుపెట్టిన రోజు నుంచి ప్రతిరోజూ ఏదో వివాదంతో వార్తల్లో నిలుస్తున్నారు మస్క్. ముఖ్యంగా ఎప్పుడు ఎలాంటి మార్పులు చేస్తారో.. ఏమేం నిర్ణయాలు తీసుకుంటారో.. అసలు ట్విట్టర్ యాప్ (Twitter App) ఉంటుందా..? అడ్రస్ లేకుండా పోతుందా అనే విషయం కూడా తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రముఖులు మొదలుకుని.. సామాన్యుడి వరకూ వాడుతున్న ఈ యాప్‌‌ విషయంలో తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.

ఇదో సమస్యగా మారింది..!

ట్విట్టర్ బ్లూ, గోల్డ్ కలర్ టిక్‌ల విషయం (Twitter Blue Tick) కూడా పెద్ద వివాదాస్పదమే అయ్యింది. సడన్‌గా సెలబ్రిటీల ఖాతాల నుంచి బ్లూ టిక్‌లు మిస్సవుతుండగా.. ఇప్పుడు సామాన్యుడు సైతం అదే బ్లూ టిక్‌ను సంపాదించుకుంటున్నాడు. ఒక్కమాటలో చెప్పాలంటే మునుపటిలా కాకుండా ఇప్పుడు ట్విట్టర్ మొత్తం మారిపోయిందనే చెప్పుకోవచ్చు. ఒకప్పుడున్న ట్విట్టర్ అకౌంట్ వెరిఫైడ్ (Twitter Verification) వ్యవస్థను మస్క్ మార్చేశారు. డబ్బులు కడితే చాలు ఎవరికైనా సరే బ్లూ టిక్ ఇచ్చేస్తోంది ట్విట్టర్ యాజమాన్యం. అంతేకాదు.. ఇదివరకున్న యాజమాన్యం డోనాల్డ్ ట్రంప్, కంగనా రనౌత్ లాంటి కొందరు ప్రముఖుల ట్విట్టర్ ఖాతాలు బ్యాన్ చేయగా మస్క్ రంగంలోకి దిగాక వాటన్నింటినీ పునరుద్దరించారు.

అసలేం జరిగింది..?

BRS (భారత రాష్ట్ర సమితి) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ ఖాతా నుంచి ఉన్నట్టుండి వెరీఫైడ్ ట్యాగ్ మాయమైంది. కేటీఆర్ ట్విట్టర్ ఖాతా నిన్నమొన్నటి వరకూ కేటీఆర్ టీఆర్ఎస్ (@KTRTRS) అని ఉండేది. టీఆర్ఎస్.. బీఆర్ఎస్‌గా మారిన తర్వాత తన ట్విట్టర్ ఖాతాను కూడా కేటీఆర్ బీఆర్ఎస్ (@KTRBRS)గా మార్చుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆ ప్రయత్నాల్లో భాగంగా KTRBRS గా మార్చారు. అయితే ఇలా చేయాల్సి వస్తే సింపుల్‌గా అకౌంట్ ఎడిట్ చేసి.. టీఆర్ఎస్ స్థానంలో బీఆర్ఎస్ అని మార్చేసుకోవచ్చు. కానీ.. ఏం జరిగిందో తెలియట్లేదు కానీ కేటీఆర్ అకౌంట్ నుంచి వెరిఫైడ్ బ్లూటిక్ మిస్సయ్యింది. దీంతో కేటీఆర్ అకౌంట్ ఇప్పుడు నాన్ వెరిఫైడ్‌గానే చూపిస్తోంది.

KTR-Twi.jpg

హ్యాక్ చేశారా..!

అకౌంట్‌‌ను ఎడిట్ చేసి పేర్లు మార్చినంత మాత్రాన బ్లూ టిక్ (Blue) అనేది ఎక్కడికీ పోదు. కానీ.. కేటీఆర్ ఖాతా విషయంలో మాత్రం ఎన్నో సందేహాలు వస్తున్నాయి. ఎవరైనా హ్యాక్ చేశారా లేకుంటే.. ఇంకేమైనా జరిగిందా అనేది తెలియట్లేదు. దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోవడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. ఈ మధ్య పలువురు రాజకీయ, సినీ ప్రముఖుల ఖాతాలు హ్యాక్ అయ్యాయి. అలా హ్యాక్ చేసి.. అసభ్యకర చిత్రాలు, సందేశాలు పోస్ట్ చేసి.. హ్యాకర్స్ రచ్చ రచ్చ చేశారు. దీంతో లబోదిబోమంటూ ట్విట్టర్ యాజమాన్యానికి రెక్వెస్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు కూడా చాలామందే ఉన్నారు.

కారణమిదేనా..!

ట్విట్టర్‌ అకౌంట్‌‌లో ఏమైనా మార్పులు చేర్పులు చేసుకుంటే (పేరు, బయో, పుట్టినరోజు లాంటివి) వెంటనే వెరిఫైడ్ అకౌంట్‌గా చూపించట్లేదు. ఇప్పుడు కేటీఆర్ విషయంలోనూ అదే జరిగింది. అయితే.. కేటీఆర్ ఫాలో అవుతున్న, ఫాలో చేస్తున్న వారి సంఖ్యలో మాత్రం ఎలాంటి మార్పులు మాత్రం జరగలేదు. ప్రస్తుతం కేటీఆర్‌ను 3.8 మిలియన్ల మంది ఫాలో అవుతుండగా.. ఆయన 161 మందిని మాత్రమే ఫాలో చేస్తున్నారు. ఒక్క బ్లూ టిక్ తప్పితే మిగిలినది అంతా సరిగ్గానే ఉంది. ఈ వెరిఫైడ్ విషయంలో మస్క్ ట్విట్టర్‌ను దక్కించుకున్నప్పటి నుంచీ పెద్ద తతంగమే నడుస్తోంది. అయితే.. ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదని.. ఇది కేవలం సాంకేతిక సమస్యే అని టెక్ నిపుణులు చెబుతున్నారు. అప్డేట్ అవ్వడానికి కాస్త సమయం తీసుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. దీన్నిబట్టి చూస్తే.. వెరిఫైడ్ అకౌంట్ కోసం కేటీఆర్ మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదన్న మాట.

చూశారుగా.. ఇదీ కేటీఆర్ బ్లూ టిక్ కథ. వెరిఫైడ్ అకౌంట్‌ అని రావడానికి ట్విట్టర్ యాజమాన్యం ఎన్ని రోజులు సమయం తీసుకుంటుందో అనేది ఎవ్వరికీ అంతుపట్టడం లేదు. ఇప్పటికే ఈ వెరిఫైడ్ విషయంలో చాలా మంది ప్రముఖులు వేచి చూస్తున్నారు. కేటీఆర్ ఇక ఎన్నిరోజులు ఆగాలో ఏంటో మరి.

ఎలన్ మస్క్ (Elon Musk) ట్విట్టర్‌ను టేకోవర్ చేసుకున్న తర్వాత ఎప్పుడేం జరుగుతోందో ఎవరికీ అంతుపట్టడం లేదు. ట్విట్టర్ ఆఫీసులో అడుగుపెట్టిన రోజు నుంచి ప్రతిరోజూ ఏదో వివాదంతో వార్తల్లో నిలుస్తున్నారు మస్క్. ముఖ్యంగా ఎప్పుడు ఎలాంటి మార్పులు చేస్తారో.. ఏమేం నిర్ణయాలు తీసుకుంటారో.. అసలు ట్విట్టర్ యాప్ (Twitter App) ఉంటుందా..? అడ్రస్ లేకుండా పోతుందా అనే విషయం కూడా తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రముఖులు మొదలుకుని.. సామాన్యుడి వరకూ వాడుతున్న ఈ యాప్‌‌ విషయంలో తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.

Updated Date - 2023-01-25T19:24:32+05:30 IST