Vijayashanti: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్ర బృందానికి అభినందనలు

ABN , First Publish Date - 2023-03-14T23:35:49+05:30 IST

ప్రతిష్టాత్మక ఆస్కార్‌ అవార్డుని గెలుపొందిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్ర బృందానికి బీజేపీ సీనియర్ నేత విజయశాంతి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

Vijayashanti: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్ర బృందానికి అభినందనలు

హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఆస్కార్‌ అవార్డుని గెలుపొందిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్ర బృందానికి బీజేపీ సీనియర్ నేత విజయశాంతి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ‘‘ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలోని ‘నాటు నాటు’ పాట బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరిలో ఉత్తమ పాటగా ఆస్కార్ అవార్డును సొంతం చేసుకోవడం భారతీయ సినీ చరిత్రలో తెలుగు జాతితో పాటు దేశం గర్వించదగిన విజయం... ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు. అలాగే డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిల్మ్‌ కేటగిరిలో ఆస్కార్ అవార్డుని సొంతం చేసుకున్న భారతీయ చిత్రం ‘ది ఎలిఫెంట్‌ విష్ఫరర్స్‌’ చిత్ర బృందానికి కూడా అభినందనలు’’ తెలిపారు.

Updated Date - 2023-03-15T00:03:23+05:30 IST