TDP leaders: తారకరత్న మరణం జీర్ణించుకోలేకపోతున్నాం

ABN , First Publish Date - 2023-02-19T11:02:05+05:30 IST

టీడీపీ యువనాయకులు, సినీ నటుడు తారకరత్నమరణం జీరంచుకోలేకపోతున్నామని టీడీపీ నేతలు అన్నారు.

TDP leaders: తారకరత్న మరణం జీర్ణించుకోలేకపోతున్నాం

అమరావతి: టీడీపీ (TDP) యువనాయకులు, సినీ నటుడు తారకరత్న (Actor Tarakaratna) మరణం జీరంచుకోలేకపోతున్నానని టీడీపీ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ (TDP leader Alapati Rajendra Prasad) అన్నారు. 23 రోజులపాటు తారకరత్న మృత్యువుతో పోరాడినా ఫలితం దక్కలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వారి ఆత్మకు దేవుడు శాంతి కలిగించాలని, నందమూరి కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన సానుభూతి తెలుపుతున్నానని చెప్పారు.

జన్మదినాన్ని జరుపుకోవాల్సిన సమయంలో కానరానిలోకాలకు తారకరత్న పోయారని టీడీపీ నేత నక్కా ఆనందబాబు (TDP leader Nakka Ananda Babu) అన్నారు. మరో మూడు రోజుల్లో తారకరత్న జన్మదినం ఉందని, ఆ వేడుకల్లో అందరినీ ఆప్యాయంగా పలకరిస్తాడని అనుకున్న సమయంలో ఆయన మరణం కుటుంబ సభ్యులకు, అభిమానులకు కోలుకోలేని ఘటన చెప్పారు. వారి ఆత్మకు శాంతికలగాలి. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి చేస్తున్నట్లు పేర్కొన్నారు.

చిన్న వయసులోనే గుండెపోటుతో పోరాడుతుంటే ఒకటో నెంబర్ కుర్రాడిలా తిరిగి వస్తాడనుకున్నామని టీడీపీ నాయకురాలు వంగలపూడి అనిత (Vangalapudi Anita) ఆవేదన వ్యక్తం చేశారు. తారకరత్న మరణం నందమూరి అభిమానులు, పార్టీ శ్రేణుల హృదయాల్లో విషాదాన్ని నింపిందని ఆమె అన్నారు. అనతికాల జీవితంలో అందరి హృదయాలలో స్థానం సంపాదించుకున్న తారకరత్న మరణం అందరికీ నమ్మశక్యంగా లేదన్నారు. కుటుంబ సభ్యులు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని, తారకరత్న ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని అనిత తెలిపారు.

సినీ రాజకీయాల్లో బంగారు భవిష్యత్తు ఉన్న తారకరత్న పిన్న వయసులో అనారోగ్యంతో అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి (Marreddy Srinivasa Reddy) అన్నారు. అటు సినీ రంగంలోనూ, ఇటు రాజకీయాల్లోను చురుగ్గా పాల్గొంటూ తనకు అంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటూ బంగారు భవిష్యత్తు ఉన్న తారకరత్న మరణించడం నందమూరి కుటుంబం సభ్యులకు, తెలుగుదేశం పార్టీ అభిమానులకు బాధాకరమని ఆయన చెప్పారు. 23 రోజులపాటు తారకరత్న మృత్యువుతో పోరాడినా ఫలితం దక్కలేదన్నారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని, వారి కుటుంబ సభ్యులకు, సినీ రాజకీయ అభిమానులకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని శ్రీనివాసరెడ్డి తెలిపారు.

టాలీవుడ్ నటుడు నందమూరి తారకరత్న (Nandamuri Tarakaratna) శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో కుటుంబ సభ్యులు, నందమూరి, నారా అభిమానులు, టీడీపీ కార్యకర్తలు శోకసంద్రంలో మునిగిపోయారు. మూడు వారాల కిందట టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) యువగళం (Yuva Galam) పాదయాత్రలో తారకరత్నకు గుండెపోటు (Heart Attack) వచ్చింది. దీంతో ప్రాథమిక చికిత్స కోసం స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించి ఆ తర్వాత కుప్పంలోని ప్రముఖ పీఈఎస్‌‌కు (PES) తరలించారు. ఆరోగ్యం మెరుగుకాకపోవడంతో అర్ధరాత్రి కుప్పం (Kuppam) నుంచి బెంగళూరులోని (Bangalore) నారాయణ హృదయాలయ (Narayana Hrudayalaya) ఆస్పత్రికి తరలించారు. వైద్య నిపుణులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. ఆఖరికి విదేశాల నుంచి వచ్చిన డాక్టర్లు శాయశక్తులా ప్రయత్నించినా ట్రీట్మెంట్‌కు తారకరత్న శరీరం సహకరించలేదు. 23 రోజులుగా బెంగళూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తారకరత్న శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు.

బెంగళూరు హాస్పిటల్‌ వెనుక గేటు నుంచి అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు తారకరత్న మృతదేహం తరలించారు. హైదరాబాద్‌లోని మోకిలలోని తన నివాసంలో తారకరత్న భౌతికకాయానికి ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. సందర్శనార్థం రేపు తెలుగు ఫిలిం చాంబర్‌లో తారకరత్న భౌతికకాయాన్ని ఉంచుతారు. రేపు ఉదయం 7 నుంచి సాయంత్రం 4 వరకు ఫిలిం చాంబర్‌లో తారకరత్న భౌతికకాయం ఉంటుంది. రేపు సాయంత్రం 5 గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.

ఈ వార్తలు కూడా చదవండి

కలకలం రేపుతున్న పోస్టర్.. జగన్ హిందువులకు క్షమాపణ చెప్పాలి

ధీరేంద్ర శాస్త్రికి ముస్లిం మత పెద్దల షాక్

Updated Date - 2023-02-19T11:07:42+05:30 IST