Dimple Hayathi: డింపుల్‌ హయాతి ఇంట్లోకి యువతీయువకుడు.. కుక్కకు మత్తు మందు ఇచ్చి ఇంట్లోకి వచ్చి ఉండొచ్చని..

ABN , First Publish Date - 2023-05-26T15:11:58+05:30 IST

నటి డింపుల్‌ హయాతి ఇంట్లోకి గురువారం ఓ యువతి, యువకుడు అక్రమంగా ప్రవేశించారు. భద్రతా సిబ్బంది వారిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. జూబ్లీహిల్స్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో..

Dimple Hayathi: డింపుల్‌ హయాతి ఇంట్లోకి యువతీయువకుడు.. కుక్కకు మత్తు మందు ఇచ్చి ఇంట్లోకి వచ్చి ఉండొచ్చని..

డింపుల్‌ హయాతి ఇంట్లోకి.. అక్రమంగా ప్రవేశించిన ఇద్దరు

పోలీసులకు ఫిర్యాదు చేసిన నటి

బంజారాహిల్స్‌ (ఆంధ్రజ్యోతి): నటి డింపుల్‌ హయాతి (Dimple Hayathi) ఇంట్లోకి గురువారం ఓ యువతి, యువకుడు అక్రమంగా ప్రవేశించారు. భద్రతా సిబ్బంది వారిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. జూబ్లీహిల్స్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో సినీనటి డింపుల్‌ హయాతి అద్దెకుంటున్నారు. ఆమె ఇంట్లోకి ఇద్దరు అక్రమంగా ప్రవేశించగా వెంటనే అప్రమత్తమై అపార్ట్‌మెంట్‌ భద్రతా సిబ్బందికి సమాచారం అందించారు. సిబ్బంది వారిని పట్టుకొని, జూబ్లీహిల్స్‌ పోలీసులకు అప్పగించారు.

ఇద్దరూ అనుమానాస్పదంగా ఉన్నారని, తన కుక్కకు మత్తు మందు ఇచ్చి ఇంట్లోకి వచ్చి ఉండొచ్చని నటి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు వారిని ప్రశ్నించగా.. యువకుడి పేరు సాయిగిరి, యువతి పేరు శృతి అని తెలిపారు. తాను నటి డింపుల్‌కు ఫ్యాన్‌ అని, ఆమెను కలిసేందుకు తన బావతో కలిసి వచ్చినట్లు శృతి పోలీసులకు తెలిపింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2023-05-26T15:12:15+05:30 IST