Ravula: ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణం చేస్తారు..
ABN , First Publish Date - 2023-06-06T16:50:30+05:30 IST
హైదరాబాద్: టీడీపీ జాతీయ అధ్యక్షుడుగా రెండోసారి ఎన్నికైన తర్వాత మంగళవారం ఎన్టీఆర్ భవన్‌కు చంద్రబాబు (Chandrababu) వచ్చారు.
హైదరాబాద్: టీడీపీ జాతీయ అధ్యక్షుడుగా రెండోసారి ఎన్నికైన తర్వాత మంగళవారం ఎన్టీఆర్ భవన్‌కు చంద్రబాబు (Chandrababu) వచ్చారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు (TDP Leaders) బాణసంచా కాల్చి ఘనస్వాగతం పలికారు. అనంతరం టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ (Kasani Gnaneshwar) ఆధ్వర్యంలో చంద్రబాబుకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖరరెడ్డి (Ravula Chandrasekhar Reddy) మాట్లాడుతూ ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా ఏపీకి ఎన్నికలు రావాలని ఆ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని, తూర్పున సూర్యుడు ఉదయిస్తాడనేది ఎంత సత్యమే.. ఏపీకి చంద్రబాబు ముఖ్యమంత్రి కావటం కూడా అంతే సత్యమని వ్యాఖ్యానించారు.
28 ఏళ్ళు వరుసగా ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉండి చంద్రబాబు రికార్డ్ సృష్టించారని రావుల చంద్రశేఖరరెడ్డి కొనియాడారు. 1995 సెప్టెంబర్ 1నుంచి టీడీపీకి చంద్రబాబుకు అధ్యక్షుడయ్యారని, 14 ఏళ్ళు సీఎంగా, మరో 14 ఏళ్ళు ప్రతిపక్ష నేతగా పనిచేశారన్నారు. ఇంకా ఈ కార్యక్రమానికి రావులతోపాటు, బక్కిన నరసింహులు, అర్వింద్ కుమార్ గౌడ్, స్థానిక నేతలు తదితరులు హాజరయ్యారు.