TSPSC Leakage Case: సిట్ అదుపులో మరో ఉద్యోగి

ABN , First Publish Date - 2023-03-22T11:01:17+05:30 IST

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సురేష్ అనే ఉద్యోగిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

TSPSC Leakage Case: సిట్ అదుపులో మరో ఉద్యోగి

హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసు (TSPSC Paper Leak Case) లో సురేష్ అనే ఉద్యోగిని సిట్ అధికారులు (SIT Officers) అదుపులోకి తీసుకున్నారు. సురేష్ టీఎస్‌పీఎస్సీలో ఉద్యోగం చేస్తున్నాడు. గ్రూప్ 1 పేపర్‌ను సురేష్‌కు ప్రవీణ్ ఇవ్వగా.. పరీక్ష రాసి సురేష్ క్వాలిఫై అయినట్లు సిట్ అధికారులు గుర్తించారు. టీఎస్‌పీఎస్సీలో పని చేస్తున్న 10 మంది ఉద్యుగుల వరకు గ్రూప్ 1 పరీక్ష రాసినట్టు సిట్ అధికారులు గుర్తించారు. వారు అందరు గ్రూప్ 1 మెయిన్స్‌కు క్వాలిఫై అయినట్టు సిట్ అధికారుల విచారణలో వెల్లడైంది. వారందరికీ సిట్ అధికారులు నోటీసులు ఇచ్చి విచారించనున్నారు. ఏడుగురు రెగ్యులర్, ముగ్గురు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సిట్ నోటీసులు అందజేసింది.

అలాగే ఈ కేసుకు సంబంధించి ప్రవీణ్, రాజ్ శేఖర్ పెన్ డ్రైవ్‌లను అధికారులు సీజ్ చేశారు. పెన్ డ్రైవ్‌లకు కూడా ప్రవీణ్, రాజ్ శేఖర్ పాస్‌వార్డ్ పెట్టారు. రూ. 14 లక్షల నగదు ఆర్ధిక లావాదేవీలపై సిట్ ఆధారాలను సేకరించింది. ప్రశ్నపత్రాలు ఇచ్చిన రేణుకకు నిలేశ్, గోపాల్ ద్వారా రూ.14 లక్షల నగదు అందినట్లు ఆధారాలను సిట్ సేకరించింది. రాజశేఖర్ కాంటాక్ట్స్, వాట్స్ అప్ చాటింగ్ వివరాలను సిట్ అధికారులు సేకరించారు.

కాగా.. ఈ కేసుకు సంబంధించి నిందితులను ఐదో రోజు కస్టడీలోకి తీసుకుని సిట్ విచారించనుంది. మరికాసేపట్లో హిమాయత్‌నగర్ సిట్‌ఆఫీస్‌లో విచారణ జరుగనుంది. టీఎస్‌పీఎస్సీ కార్యాలయం వద్ద వాల్ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. టీఎస్‌పీఎస్సీ ఆఫీస్‌ ఓ జిరాక్స్ సెంటర్ అంటూ పోస్టర్లు వెలిశాయి. ఇచ్చట అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగ ప్రశ్నాపత్రాలు లభిస్తాయంటూ సెటైర్లు విసురుతూ పోస్టర్లు అతికించారు. ఓయూ జేఏసీ చైర్మన్‌ అర్జున్‌బాబు పేరుతో ఈ పోస్టర్లు వెలిశాయి. పలు డిమాండ్‌లతో పాటు కొన్ని ప్రశ్నలను ఈ పోస్టర్ ద్వారా లేవనెత్తారు.

Updated Date - 2023-03-22T11:01:17+05:30 IST