Triangle love: హైదరాబాద్‌లో ట్రైయాంగిల్ లవ్ స్టోరీ.. ఒకరితో సహజీవనం.. మరొకరితో ప్రేమ.. చివరికి జరిగిందిదీ..

ABN , First Publish Date - 2023-07-23T11:32:40+05:30 IST

ఓ యువతితో సహజీవనం చేస్తున్నాడు. మరో యువతితో ప్రేమాయణం నడుపుతున్నాడు. ఇది తెలిసి సహజీవనం చేస్తున్న యువతి నిలదీయడమే కాకుండా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రేమించిన యువతి పెళ్లికి అంగీకరించలేదు. దీంతో ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

Triangle love: హైదరాబాద్‌లో ట్రైయాంగిల్ లవ్ స్టోరీ.. ఒకరితో సహజీవనం.. మరొకరితో ప్రేమ.. చివరికి జరిగిందిదీ..

బంజారాహిల్స్‌, జూలై 22 (ఆంధ్రజ్యోతి): ఓ యువతితో సహజీవనం చేస్తున్నాడు. మరో యువతితో ప్రేమాయణం నడుపుతున్నాడు. ఇది తెలిసి సహజీవనం చేస్తున్న యువతి నిలదీయడమే కాకుండా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రేమించిన యువతి పెళ్లికి అంగీకరించలేదు. దీంతో ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

పోలీసుల వివరాల ప్రకారం, కర్నూలుకు చెందిన శివ ప్రసాద్‌ (23) నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తున్నాడు. కొంతకాలంగా ఓ యువతితో ఫిలింనగర్‌లో గదిని అద్దెకు తీసుకొని సహజీవనం చేస్తున్నాడు. మరోవైపు తాను పనిచేసే ఆస్పత్రిలో ఓ నర్సుతో ప్రేమాయణం కొనసాగిస్తున్నాడు. సహజీవనం చేస్తున్న యువతికి శివప్రసాద్‌ ప్రేమవ్యవహారం తెలిసి మూడు రోజుల క్రితం నిలదీసింది. ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో కలత చెందిన ఆమె నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ క్రమంలోనే శుక్రవారం సాయం త్రం ప్రేమించిన నర్సును పెళ్లి చేసుకుందామని శివప్రసాద్‌ అడిగాడు. అందుకు ఆమె నిరాకరించింది. సహజీవనం చేస్తున్న యువతి నిద్రమాత్రలు మింగి ఆస్పత్రిలో చేరడం, ప్రేమించిన యువతి పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపం చెందిన శివప్రసాద్‌ శనివారం తెల్లవారుజామున తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించామని, ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. నిద్రమాత్రలు మింగిన యువతి కోలుకోవడంతో ఆమెను పునరావాస కేంద్రానికి తరలించినట్లు తెలిపారు.

Updated Date - 2023-07-23T12:46:42+05:30 IST