Share News

Trainee IPS Mounika: తెలంగాణ బిడ్డను.. తెలంగాణ క్యాడర్ రావడం ఆనందంగా ఉంది

ABN , First Publish Date - 2023-10-25T15:11:34+05:30 IST

తాను తెలంగాణ బిడ్డనని.. తెలంగాణ క్యాడర్ రావడం ఆనందంగా ఉందని ట్రైనీ ఐపీఎస్ మౌనిక తెలిపారు. నేడు ఆమె ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. శిక్షణ సమయంలో సైబర్ నేరాలు, మహిళా భద్రత, లా ఇన్ఫోర్స్మెంట్‌పై శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు.

Trainee IPS Mounika: తెలంగాణ బిడ్డను.. తెలంగాణ క్యాడర్ రావడం ఆనందంగా ఉంది

హైదరాబాద్ : తాను తెలంగాణ బిడ్డనని.. తెలంగాణ క్యాడర్ రావడం ఆనందంగా ఉందని ట్రైనీ ఐపీఎస్ మౌనిక తెలిపారు. నేడు ఆమె ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. శిక్షణ సమయంలో సైబర్ నేరాలు, మహిళా భద్రత, లా ఇన్ఫోర్స్మెంట్‌పై శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. ఐపీఎస్ ట్రైనింగ్‌లో ఇండోర్, ఔట్ డోర్ రెండు విభాగాల్లోనూ శిక్షణ పూర్తి చేసుకున్నానని మౌనిక తెలిపారు. హైదరాబాద్‌లో పుట్టి పెరిగాను కాబట్టి రాష్ట్ర పరిస్థితులు తనకు అవగాహన ఉన్నాయన్నారు. తాను ఎన్నో అవమానాలు పడి.. చివరికి ఐపీఎస్ సాధించాలని లక్ష్యంతో ముందుకు వెళ్లానని తెలిపారు. తన తండ్రి కోరిక మేరకే ఐపీఎస్ అయ్యానని మౌనిక వెల్లడించారు. వచ్చే రోజుల్లో సైబర్ నేరాలు మరింతగా పెరిగే అవకాశం ఉంది కాబట్టి వాటిపై ప్రత్యేక దృష్టి పెడతానన్నారు. చిన్నప్పటి నుంచి సివిల్ సర్వీసెస్‌పై తన తండ్రి అవగాహన కల్పించారన్నారు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఎట్టకేలకు ఐపీఎస్ అయ్యానని తెలిపారు. హోం క్యాడర్ రావడం అనేది దేవుడు ఇచ్చిన వరమని.. దానిని అదృష్టంగా భావిస్తున్నానని మౌనిక తెలిపారు.

Updated Date - 2023-10-25T15:11:34+05:30 IST