BJP: ‘సంచలనాలకు కేంద్రంగా సుఖేశ్చంద్ర లేఖ నిలుస్తోంది’

ABN , First Publish Date - 2023-04-12T19:26:46+05:30 IST

సంచలనాలకు కేంద్రంగా సుఖేశ్చంద్ర ((Sukesh Chandrasekhar) లేఖ నిలుస్తోందని బీజేపీ (BJP) ఎమ్మెల్యే రఘునందన్ రావు (Raghunandan Rao) అన్నారు.

BJP: ‘సంచలనాలకు కేంద్రంగా సుఖేశ్చంద్ర లేఖ నిలుస్తోంది’

హైదరాబాద్: సంచలనాలకు కేంద్రంగా సుఖేశ్చంద్ర ((Sukesh Chandrasekhar) లేఖ నిలుస్తోందని బీజేపీ (BJP) ఎమ్మెల్యే రఘునందన్ రావు (Raghunandan Rao) అన్నారు. BRS పెద్దలతో చేసిన షార్ట్లను సుఖేశ్ బయటపెట్టారని తెలిపారు. తెలంగాణభవన్ (Telangana Bhavan) లో రూ.కోట్లు అప్పగించినట్లు చాట్లో ఉందన్నారు. రూ.15 కోట్లు బ్లాక్ రేంజ్ రోవర్ కారు(నం.6060)లో ఇచ్చినట్లు చాట్లో ఉందని ఆరోపించారు. నం.6060 కారు ఎవరిదో రవాణాశాఖ అధికారులు, పోలీసులు తెలపాలని డిమాండ్ చేశారు. కారు ఎవరిది.. ఎవరి పేరు మీద రిజిస్టర్ అయిందో తేల్చాలని రఘునందన్ డిమాండ్ చేశారు. తెలంగాణభవన్లోకి కారు(నం.6060) రాలేదని పుటేజ్ బయటపెట్టగలరా? అని ఆయన ప్రశ్నించారు. 15 కిలోల నెయ్యి అనే పదార్థాన్ని సుఖేశ్ ఎన్నిసార్లు ఇచ్చి వెళ్లారు? అని ప్రశ్నించారు.

కాగా సుమారు రూ.200 కోట్ల మనీల్యాండరింగ్ కేసులో ఢిల్లీలోని మండోలి జైలులో ఉన్న సుకేశ్ చంద్రశేఖర్ (Sukesh Chandrasekhar) మరో సంచలనానికి తెరదీశాడు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌, మాజీ మంత్రి సత్యేంద్రజైన్‌ ఆదేశాలపై హైదరాబాద్‌ బీఆర్‌ఎస్‌ ఆఫీస్‌లో రూ.15 కోట్ల డబ్బులు కారులో ముట్టజెప్పినట్టు ఇటివలే లేఖ విడుదల చేసిన సుకేష్ తాజాగా మరో బాంబ్ పేల్చాడు. డబ్బు ముట్టజెప్పే విషయమై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో వాట్సప్ చాటింగ్ జరిగిందని పేర్కొంటూ పలు వాట్సప్ స్ర్కీన్ షాట్లను అతడు షేర్ చేశాడు. కవితతో చాట్ ఇదేనంటూ సుకేశ్ పేర్కొన్నాడు. ఆమెతో పలుమార్లు చాట్ చేసినట్టు పేర్కొన్నాడు. కేజ్రీవాల్‌ను AKగా, సత్యేంద్ర జైన్‌ను SJగా కోడ్ నేమ్‌తో చాటింగ్ చేసినట్టు స్ర్కీన్‌ షాట్లలో కనిపిస్తోంది. ఇక ఎమ్మెల్సీ కవిత పేరును Kavita Akka TRS తో నంబర్ సేవ్ చేసుకున్నట్టుగా అందులో కనిపిస్తోంది.

Updated Date - 2023-04-12T19:26:50+05:30 IST