KTR: అమిత్ షాపై మంత్రి కేటీఆర్ సెటైర్ ట్వీట్

ABN , First Publish Date - 2023-04-23T21:32:28+05:30 IST

చేవెళ్ల విజయ సంకల్ప సభ’లో కేంద్రమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్‌షా (Amit Shah) కీలక వ్యాఖ్యలు చేశారు.

KTR: అమిత్ షాపై మంత్రి కేటీఆర్ సెటైర్ ట్వీట్

హైదరాబాద్: ‘చేవెళ్ల విజయ సంకల్ప సభ’లో కేంద్రమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్‌షా (Amit Shah) కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే అమిత్ షాపై మంత్రి కేటీఆర్ (KTR) సెటైర్ ట్వీట్ చేశారు. ‘‘హైదరాబాద్కు ITIR, పాలమూరుకు జాతీయహోదా ఇచ్చినందుకు థ్యాంక్యూ అమిత్ జీ. మెట్రో ఫేజ్-2, IIM, IISER, IIT, నవోదయ, వైద్య కళాశాలలు ఇచ్చినందుకు థ్యాంక్యూ అమిత్ జీ. ఓహ్.. ఒక్క నిమిషం.. ఆయన ఇవేమీ ఇవ్వలేదు. టీఎస్ కంటే మెరుగైన బీజేపీ పాలిత రాష్ట్రం ఏదో చెప్పండి’’ అని కేటీఆర్ సెటైర్ ట్వీట్ ఇచ్చారు.

Updated Date - 2023-04-23T21:32:28+05:30 IST