KCR: సీఎం కేసీఆర్‌కు షాకిచ్చిన మహారాష్ట్ర పోలీసులు

ABN , First Publish Date - 2023-04-19T16:46:33+05:30 IST

బీఆర్ఎస్‌ (BRS)కు మహారాష్ట్ర పోలీసులు షాకిచ్చారు. మహారాష్ట్రలో BRS సభకు పోలీసుల అనుమతి నిరాకరించారు.

KCR: సీఎం కేసీఆర్‌కు షాకిచ్చిన మహారాష్ట్ర పోలీసులు

హైదరాబాద్: బీఆర్ఎస్‌ (BRS)కు మహారాష్ట్ర పోలీసులు షాకిచ్చారు. మహారాష్ట్రలో BRS సభకు పోలీసుల అనుమతి నిరాకరించారు. ఈనెల 24న అంఖాస్ మైదానంలో BRS సభకు సన్నాహాలు చేస్తున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేసినట్లు తెలిసింది. మరో ప్రదేశాన్ని ఎంచుకోవాలని ఔరంగాబాద్ పోలీసులు సూచించారు. దాంతో పోలీసుల తీరు పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మరో ప్రదేశంలో సభ నిర్వహణకు గులాబీ దళం సిద్ధమవుతుంది. కాగా బీఆర్ఎస్ ను విస్తరించాలనే కార్యాచరణలో భాగంగా మహారాష్ట్రను (Maharashtra) ఎంపిక చేసుకున్నారు. ఇప్పటికే మరాఠా గడ్డలో రెండు సభలు నిర్వహించారు. ఇక మూడో సభ కూడా నిర్వహించాలని తేదీలు ఖరారు చేసుకోగా మహారాష్ట్ర పోలీసులు షాకిచ్చారు. కేసీఆర్ నిర్వహించాల్సిన బహిరంగ సభకు అనుమతి (Permission Denied) నిరాకరించారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ ఛత్రపతి శంభాజీ నగర్ కొత్తపేరులో (Aurangabad) ఈనెల 24వ తేదీన బహిరంగ సభ నిర్వహించాలని కేసీఆర్ (KCR) నిర్ణయించారు. అక్కడి అంఖాస్ మైదానంలో (Aamkhas Grounds) సభకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.

Updated Date - 2023-04-19T16:46:37+05:30 IST