Delhi: సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

ABN , First Publish Date - 2023-02-08T11:47:13+05:30 IST

ఢిల్లీ: సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు (MLAs Poaching Case)లో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

Delhi: సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

ఢిల్లీ: సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు (MLAs Poaching Case)లో తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt.) సుప్రీంకోర్టు (Supreme Court)ను ఆశ్రయించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ (Petition) వేసింది. సీజేఐ (CJI) ధర్మాసనం ముందు ప్రభుత్వం తరఫు న్యాయవాది సిద్ధార్థ లుత్రా (Siddhartha Luthra) మెన్షన్ చేశారు. అయితే స్టేటస్ కో (Status Co) ఇవ్వడానికి ధర్మాసనం నిరాకరించింది. కేసులో మెరిట్స్ ఉంటే హై కోర్టు తీర్పును రివర్స్ చేస్తామని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. దీనిపై ఈ నెల 17న విచారణ జరిపేందుకు న్యాయస్థానం అంగీకరించింది.

ఎమ్మెల్యేల కొనుగోలు కేసును తెలంగాణ హైకోర్టు సీబీఐకు అప్పగించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఈ నెల 13న విచారించాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది సిద్ధార్థ లుత్రా ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. త్వరిత గతిన విచారించడానికి నిరాకరిస్తూ.. 17వ తేదీన విచారిస్తామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. పదే పదే విజ్ఞప్తి చేసినా నిరాకరించింది. సీబీఐ చేతికి సాక్షులు వెళ్తే చేసేది ఏమీ లేదని సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం.. మెరిట్స్ ఉంటే హై కోర్టు తీర్పును రివర్స్ చేస్తామని పేర్కొంది.

ఇది కూడా చదవండి

కాగా తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు (Supreme Court) చేరింది. ఇప్పటికే కేసును సిట్‌తో కాకుండా సీబీఐతో విచారణ జరిపించాలని హైకోర్టు తీర్పునిచ్చింది. అయితే తీర్పును మూడు వారాల పాటు నిలిపియాలని ప్రభుత్వం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. లంచ్ మోషన్‌లో విచారణ జరిపిన సింగిల్ బెంచ్ న్యాయస్థానం రిట్ అప్పీల్ విచారణ డివిజన్ బెంచ్‌లో జరిగింది కాబట్టి.. చీఫ్ జస్టిస్ అనుమతి తీసుకొని రావాలని సింగిల్ బెంచ్ న్యాయస్థానం కోరింది.. దీంతో ప్రభుత్వం డైరెక్ట్‌గా సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది...

Updated Date - 2023-02-08T11:47:16+05:30 IST