TS Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. సాయన్నకు సభ నివాళి

ABN , First Publish Date - 2023-08-03T11:57:16+05:30 IST

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ మొదలైన వెంటనే రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, ప్రముఖ గాయకుడు, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నకు అసెంబ్లీ నివాళి అర్పించింది.

TS Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. సాయన్నకు సభ నివాళి

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ మొదలైన వెంటనే కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నకు (MLA Saichand) అసెంబ్లీ నివాళి అర్పించింది. సాయన్న మృతికి ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) సభలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. సాయన్న లేని లోటు తీర్చలేదన్నారు. కంటోన్మెంట్‌ను జీహెచ్‌ఎంసీలో కలపాలని ఆయన ఎంతో కృషి చేశారని గుర్తుచేశారు. సాయన్న అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన నేత అని అన్నారు. సాయన్న కుటుంబానికి సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మిగిలిన సభ్యులు కూడా సాయన్న మృతిపట్ల సంతాపం తెలుపుతూ.. ఆయనతో ఉన్న అనుబంధాన్ని సభా వేదికగా పంచుకున్నారు. సాయన్న మృతికి శాసనసభ రెండు నిమిషాలు మౌనం పాటించింది. అనంతరం తెలంగాణ అసెంబ్లీ రేపటికి(శుక్రవారం) వాయిదా పడింది. అసెంబ్లీ సమావేశాలకు బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందనరావు, గోషామహాల్ ఎమ్మెల్యే రాజసింగ్ హాజరయ్యారు.

కాగా... ఈరోజు ఉదయం 11:30 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. పని దినాలు ఎన్ని ఉండాలి? ఏయే అంశాలపై చర్చించాలి? అనే అంశాలపై గురువారం సాయంత్రం నిర్వహించే శాసన సభా వ్యవహారాల సలహా కమిటీ(బీఏసీ) సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.


మరోవైపు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో మూఢంచల భద్రత ఏర్పాటు చేశారు. ధర్నాలు రాస్తారోకోలు, నిరసనలపై నిషేధం విధించారు. నిబంధనలు ఉల్లాంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు మెచ్చరించారు. ఈ ప్రభుత్వానికి ఇవే చివరి సమావేశాలు కావడంతో పలు పార్టీ నేతలు అసెంబ్లీ ముట్టడి చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో దాదాపు 1000 మందితో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈరోజు గ్రూప్ - 2 అభ్యర్థులు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అసెంబ్లీ పరిసరప్రాంతాల్లో లా అండ్ ఆర్డర్, టాస్క్ ఫోర్స్, ఇంటిలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్, పోలీసులు బందోబస్త్ ఏర్పాటు చేశారు.

Updated Date - 2023-08-03T15:01:50+05:30 IST