Share News

TDP: యువ ఓటర్ల కోసం టీడీపీ పిలుపు.. ఈ కార్యక్రమంపై విజయసాయి ఏమన్నారంటే..

ABN , First Publish Date - 2023-12-04T17:04:28+05:30 IST

యువ ఓటర్ల కోసం ‘‘టీడీపీ మై ఫస్ట్ ఓట్ ఫర్ సీబీఎన్’’ ఫోరం పేరుతో యువ ఓటర్ల కోసం కూకట్‌పల్లిలోని ఒక ఫంక్షన్ హాల్లో టీడీపీ మద్దతు దారులు ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అభిమానలు, యువ ఓటర్లు పాలుపంచుకోవాలని ఓ ప్రకటనలో తెలిపారు. అయితే ఈ కార్యక్రమంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై ఎక్స్‌లో తీవ్ర విమర్శలు చేశారు.

TDP: యువ ఓటర్ల కోసం టీడీపీ పిలుపు.. ఈ కార్యక్రమంపై విజయసాయి ఏమన్నారంటే..

హైదరాబాద్: యువ ఓటర్ల కోసం ‘‘టీడీపీ మై ఫస్ట్ ఓట్ ఫర్ సీబీఎన్’’ ఫోరం పేరుతో యువ ఓటర్ల కోసం కూకట్‌పల్లిలోని ఒక ఫంక్షన్ హాల్లో టీడీపీ మద్దతు దారులు ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అభిమానులు, యువ ఓటర్లు పాలుపంచుకోవాలని ఓ ప్రకటనలో తెలిపారు. నగరంలో చదువుతున్న ఏపీ విద్యార్థులకు ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. చంద్రబాబు విజన్ 2047 ను కొత్త ఓటర్లకు వివరిస్తూ కార్యక్రమం చేపట్టారు. అయితే ఈ కార్యక్రమంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై ఎక్స్‌లో తీవ్ర విమర్శలు చేశారు.


విజయసాయి ఏమన్నారంటే..

VIJAY-SAI-REDDY.jpg

‘‘చంద్రబాబు గారి గుణమే...స్ట్రాటెజీల పేరుతో కుట్రలకు పాల్పడడం. యువ ఓటర్లు మొదటి ఓటు CBNకు వేయాలట! ఆయన సామాజికవర్గం వారు కూకట్‌పల్లిలో సోమవారం ఒక సదస్సును ఏర్పాటు చేస్తున్నారు. దీని ఉద్దేశం ఏమిటంటే కొత్త ఓటర్లంతా ఏపీకి తమ ఓట్లను బదిలీ చేయించుకుని వివిధ కేసుల్లో నిందితుడైన బాబు గారిని భుజాలపై మోయాలట’’ అని విజయసాయి ఎక్స్‌లో ఎద్దేవ చేశారు.

Updated Date - 2023-12-04T22:49:15+05:30 IST