Congress: కాసేపట్లో టీ.కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీ
ABN , Publish Date - Dec 18 , 2023 | 10:15 AM
Telangana: తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం మరికాసేపట్లో జరుగనుంది. గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జి ఠాక్రే అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి సీఎం, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్లు, కమిటీ సభ్యులు హాజరుకానున్నారు.
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం మరికాసేపట్లో జరుగనుంది. గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జి ఠాక్రే అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి సీఎం, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్లు, కమిటీ సభ్యులు హాజరుకానున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇదే మొదటి పీఏసీ సమావేశం. ప్రభుత్వం, పార్టీ మధ్య అనుసంధానంపై పీఏసీలో చర్చ జరుగనుంది. పార్లమెంట్ ఎన్నికలపైనా పీఏసీ చర్చించనుంది. నామినేటెడ్ పదవుల భర్తీపై పీఏసీ నిర్ణయం తీసుకోనుంది. ఈ నెల 28న కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. బోయినపల్లిలోని గాంధీ నాలెడ్జ్ సెంటర్ నిర్మాణం వేగవంతం కోసం ఆ బాధ్యతను వర్కింగ్ ప్రెసిడెంట్లకు పీఏసీ అప్పచెప్పనుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..