TS NEWS: స్విగ్గీ డెలివరీ బాయ్ అనుమానాస్పద స్థితిలో మృతి

ABN , First Publish Date - 2023-09-22T20:36:56+05:30 IST

స్విగ్గీ డెలివరీ బాయ్(Swiggy delivery boy) అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఈ సంఘటన చందానగర్(Chandanagar) పరిధిలోని వెరిటేక్స్ విల్లా నిర్మాణాల్లో జరిగింది.

TS NEWS: స్విగ్గీ డెలివరీ బాయ్ అనుమానాస్పద స్థితిలో మృతి

హైదరాబాద్‌: స్విగ్గీ డెలివరీ బాయ్(Swiggy delivery boy) అనుమానస్పద స్థితిలో మృతిచెందాడు. ఈ సంఘటన చందానగర్(Chandanagar) పరిధిలోని వెరిటేక్స్ విల్లా నిర్మాణాల్లో జరిగింది. చనిపోయిన వ్యక్తి లింగంపల్లికి చెందిన అనిల్‌గా గుర్తించారు. అనిల్ స్విగ్గీలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. అనిల్ శరీరంపై తీవ్ర గాయాలు ఉన్నాయి. సమాచారం అందిన వెంటనే చందానగర్ పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి వివరాలు సేకరిస్తున్నారు. తాను పనిచేస్తున్న ఆఫీస్‌కు పోలీసులు సమాచారం అందించారు.పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆధారాల కోసం దగ్గరిలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డెలివరీ బాయ్‌కు గతంలో ఎవరితోనైనా గొడవలు ఉన్నాయా అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Updated Date - 2023-09-22T20:42:40+05:30 IST