Avinash Reddy: 4 కారణాలు చూపించి అవినాష్‌ను అనుమానిస్తున్నారన్న న్యాయవాది..

ABN , First Publish Date - 2023-05-26T12:56:24+05:30 IST

హైదరాబాద్: కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో వాదనలు వాడీ వేడిగా జరుగుతున్నాయి. అవినాష్ తరఫున న్యాయవాది ఉమా మహేశ్వరరావు వాదనలు వినిపిస్తున్నారు.

Avinash Reddy: 4 కారణాలు చూపించి అవినాష్‌ను అనుమానిస్తున్నారన్న న్యాయవాది..

హైదరాబాద్: కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి (Avinash Reddy) ముందస్తు బెయిల్ పిటిషన్‌ (Mundostu Bail Petition)పై తెలంగాణ హైకోర్టు (Telangana Hidh Court)లో వాదనలు వాడీ వేడిగా జరుగుతున్నాయి. అవినాష్ తరఫున న్యాయవాది ఉమా మహేశ్వరరావు (Uma MaheswaraRao) వాదనలు వినిపిస్తున్నారు... 2020 నుండి సీబీఐ (CBI) ఈ కేసు దర్యాప్తు చేస్తునే ఉందన్నారు. ఇంకొన్ని నెలలు గడుస్తే నాలుగేళ్లు అవుతుందన్నారు. అనుమానితులు అందరూ వైసీపీ పార్టీకి చెందిన వారేనని, ఒకే పార్టీలో ఉన్నప్పుడు ఫోన్ కాల్స్ సర్వ సాధారణమన్నారు. ఫోన్ కాల్స్ ఆధారంగా చూపించి అవినాష్‌ను ఇరికించాలని చూస్తున్నారని పేర్కొన్నారు. 4 కారణాలు చూపించి అవినాష్ రెడ్డిని అనుమానిస్తున్నారన్నారు.

2017 ఎలక్షన్, 2019 ఎంపీ ఎలక్షన్ క్యాండిడేట్ కారణమని సిబీఐ చెబుతోందని, 2017లో వివేక ఓడిపోవడానికి అప్పటి ఎంపీటీసీ (MPTC), జెడ్పీటీసీ (ZPTC)లు కారణమని, ఈ స్టేట్‌మెంట్ రవీంద్ర రెడ్డి ఇచ్చారని అవినాష్ తరఫు న్యాయవాది ఉమా మహేశ్వరరావు అన్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో సీబీఐ రూ. 46 లక్షల 17 వేలు రికవరీ చేసిందన్నారు. ఆ డబ్బు గురించి సీబీఐ ఎందుకు దర్యాప్తు చేయట్లేదని ప్రశ్నించారు. సిట్‌పై నమ్మకం లేక సీబీఐతో విచారించాలని 5 పిటిషన్లు వేశారని ఇందులో భాగంగా కోర్టు సీబీఐకు కేసు అప్పగించిందన్నారు. న్యాయస్థానం ఎంతో నమ్మకంతో సీబీఐకు కేసు అప్పగించిందని, ఆ నమ్మకాన్ని సీబీఐ నిలబెట్టుకోలేదన్నారు. అప్పటి ఎఫ్‌ఐఆర్‌లో ఉన్న అంశాలనే పరిగణలోకి తీసుకుని కొత్త ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిందన్నారు.

9/7/2020 సిబిఐ ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేసిందని, 10/06/21 మొదటి ఛార్జ్ షీట్ దాఖలు చేసిందని, 28/03/2019లో గంగి రెడ్డిని సిట్ అరెస్ట్ చేసిందని లాయర్ ఉమా మహేశ్వరరావు తెలిపారు. అలాగే 2/8/21 సునీల్ యాదవ్‌ను సీబీఐ అరెస్ట్ చేసిందని, 09/09/21 ఉమాశంకర్ రెడ్డిని అరెస్ట్ చేసిందన్నారు. ఈ క్రమంలో దస్తగిరిని ఎప్పుడు సీబీఐ అరెస్ట్ చేసిందని హై కోర్టు ప్రశ్నించింది. దస్తగిరి అరెస్టు ఈ కేసుకు చాలా కీలకమని, దాని గురించి మళ్ళీ వివరిస్తానని అవినాష్ తరపు న్యాయవాది అన్నారు. ఈ నలుగురు నిందితులు వివేకాను హత్య చేశారన్నారు. 25/8/21న దస్తగిరిని సీబీఐ విచారణకు పిలిచిందని, ఆయన స్టేట్‌మెంట్‌తోనే కేసును సీబీఐ అనేక మలుపులు తిప్పిందన్నారు. సునీల్ యాదవ్ తల్లి, ఉమా శంకర్ రెడ్డి భార్యతో వివేకకు అక్రమ సంబంధం ఉందని లాయర్ ఉమా మహేశ్వరరావు వాదనలు వినిపించారు.

Updated Date - 2023-05-26T13:11:05+05:30 IST