Suresh Babu: చంద్రబాబు అరెస్టుపై ప్రొడ్యూసర్ సురేష్ బాబు స్పందన..

ABN , First Publish Date - 2023-09-19T13:41:24+05:30 IST

హైదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై ప్రొడ్యూసర్ సురేష్ బాబు స్పందించారు. ఈ సందర్బంగా మంగళవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ తెలుగు సినీ పరిశ్రమ ఏ రాజకీయ నాయకులకు, ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేదని అన్నారు.

Suresh Babu: చంద్రబాబు అరెస్టుపై ప్రొడ్యూసర్ సురేష్ బాబు స్పందన..

హైదరాబాద్: టీడీపీ అధినేత (TDP Chief) చంద్రబాబు అరెస్టు (Chandrababu Arrest)పై ప్రొడ్యూసర్ సురేష్ బాబు (Producer Suresh Babu) స్పందించారు. ఈ సందర్బంగా మంగళవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ తెలుగు సినీ పరిశ్రమ ఏ రాజకీయ నాయకులకు, ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేదని అన్నారు. సినిమా అనేది ఒక ఆర్ట్ ఫామ్ (Art form) అని, సినిమాకు వ్యక్తిగత జీవితాలకు సంబంధం లేదని, వ్యక్తిగతంగా పార్టీకి కార్యకర్తగా తాను పనిచేశానని.. అది తన పర్సనల్ విషయమని చెప్పారు.

కానీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి వ్యక్తిగత విషయాలకు స్పందించాల్సిన అవసరం లేదని సురేష్ బాబు అన్నారు. తెలుగు సినిమా పరిశ్రమకు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ముఖ్యమంత్రులతోపాటు ప్రస్తుతం తెలంగాణ (Telangana), ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రుల సహకారం ఉందని ఆయన స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎన్టీఆర్ (NTR), చెన్నారెడ్డి (Chenna Reddy) తెలుగు సినిమా అభివృద్ధికి అత్యంత కృషి చేశారని..‌ తదనంతరం వచ్చినటు వంటి ముఖ్యమంత్రులు కూడా సినిమా అభివృద్ధికి తోడ్పడిన వాళ్లేనని సురేష్ బాబు పేర్కొన్నారు.

Updated Date - 2023-09-19T13:41:24+05:30 IST