IT Employees: చంద్రబాబుకు మద్దతుగా ఐటీ ఉద్యోగుల స్పెషల్ ప్రోమో... సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్

ABN , First Publish Date - 2023-09-30T13:22:01+05:30 IST

స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఐటీ ఉద్యోగులు మద్దతుగా నిలిచారు. చంద్రబాబు అరెస్ట్‌ అక్రమమని.. వెంటనే ఆయనను విడుదల చేయాలంటూ హైదరాబాద్‌లోని ఐటీ ఉద్యోగులు డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. చంద్రబాబుకు మద్దతుగా ర్యాలీలు, ఆందోళనలు కూడా చేపట్టారు.

IT Employees: చంద్రబాబుకు మద్దతుగా ఐటీ ఉద్యోగుల స్పెషల్ ప్రోమో... సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్

హైదరాబాద్: స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో (Skill Development Case)అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు (TDP Chief Chandrababu Naidu) ఐటీ ఉద్యోగులు (IT Employees) మద్దతుగా నిలిచారు. చంద్రబాబు అరెస్ట్‌ అక్రమమని.. వెంటనే ఆయనను విడుదల చేయాలంటూ హైదరాబాద్‌లోని ఐటీ ఉద్యోగులు డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. చంద్రబాబును (Chandrababu Arrest) సపోర్ట్ చేస్తూ ర్యాలీలు, ఆందోళనలు కూడా చేపట్టారు. ఇప్పుడు తాజాగా.. చంద్రబాబుకు మద్దతుగా హైదరాబాద్ ఐటీ ఉద్యోగులు స్పెషల్ ప్రోమోను రూపొందించారు. హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాలకు బాబు చేసిన అభివృద్ధిని వివరిస్తూ వీడియో విడుదల చేశారు. సోషల్ మీడియాలో చంద్రబాబు స్పెషల్ ప్రోమోను ఐటీ ఉద్యోగులు విస్తృతంగా షేర్ చేస్తున్నారు. బాబు చేసిన అభివృద్ధిని గతంలో మంత్రి కేటీఆర్ (Minister KTR) చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ వీడియోను రూపొందించారు.

Updated Date - 2023-09-30T13:22:01+05:30 IST