South Central Railway CPRO: తెలుగు ప్రయాణికుల కోసం ప్రత్యేక కంట్రోల్ రూంలు ఏర్పాటు

ABN , First Publish Date - 2023-06-03T13:54:25+05:30 IST

ఒడిశా కొరమండల్ రైలు ప్రమాదంతో దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తంగా ఉందని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేష్ తెలిపారు.

South Central Railway CPRO: తెలుగు ప్రయాణికుల కోసం ప్రత్యేక కంట్రోల్ రూంలు ఏర్పాటు

హైదరాబాద్: ఒడిశా కొరమండల్ రైలు ప్రమాదంతో (Odisha Train Accident) దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తంగా ఉందని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేష్ (South Central Railway CPRO Rakesh) తెలిపారు. రైలు ప్రమాదంపై ఏబీఎన్‌తో (ABN - Andhrajyothy) మాట్లాడుతూ.. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. .తెలుగు ప్రయాణికుల సమాచారం కోసం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రమాద ఘటన తీవ్రంగా ఉండడంతో ఒడిశా వైపు వెళ్లే 19 రైళ్లను రద్దు చేశామని, 26 రైళ్లను దారి మళ్లించామన్నారు. రైళ్ల రద్దుతో ప్రయాణికులకు డబ్బులు రిఫండ్ చేశామన్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి రైల్వే సిబ్బంది నిరంతరం పని చేస్తున్నారని.. అక్కడ పనులు పూర్తవగానే తిరిగి రైళ్లు యధావిధిగా నడుస్తాయని రాకేష్ వెల్లడించారు.

తెలుగు వారు 178 మంది..

మరోవైపు ఒడిస్సాలో ప్రమాదానికి గురైన రైళ్లల్లో తెలుగు వారు 178 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మృతులు, గాయపడ్డవారు, మిస్సింగ్ వివరాల సమాచారం సేకరించే పనిలో అధికారులు ఉన్నారు. శ్రీకాకుళం, విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు, కృష్ణా జిల్లా కలక్టరేట్‌లలో‌ కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశారు. విజయవాడలో దిగాల్సి‌న 39 మందిలో 23 మంది కాంటాక్ట్‌లోకి వచ్చారు. ఏడుగురు ఫోన్లు స్విచ్ ఆఫ్ అని వస్తున్నారు. మరోవైపు ఐదుగురు ప్రయాణికులు ఫోన్‌లు లిఫ్ట్ చేయని పరిస్థితి. సహాయక చర్యలు కోసం ఏపీ అధికారుల బృందం ఒడిస్సా వెళ్లింది.

Updated Date - 2023-06-03T13:55:33+05:30 IST