Hyderabad: గచ్చిబౌలిలో బోర్డు తిప్పేసిన సాఫ్ట్‌వేర్ కంపెనీ....

ABN , First Publish Date - 2023-04-18T13:15:39+05:30 IST

హైదరాబాద్: గచ్చిబౌలిలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ (Software Company) బోర్డు తిప్పేసింది. ఉద్యోగులను తీసివేస్తున్నట్లు కంపెనీ వారికి మెయిల్ పంపింది.

Hyderabad: గచ్చిబౌలిలో బోర్డు తిప్పేసిన సాఫ్ట్‌వేర్ కంపెనీ....

హైదరాబాద్: గచ్చిబౌలిలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ (Software Company) బోర్డు తిప్పేసింది. ఉద్యోగులను తీసివేస్తున్నట్లు కంపెనీ వారికి మెయిల్ పంపింది. దీంతో షాక్‌ అయిన ఉద్యోగులు గచ్చిబౌలిలోని ఇన్ఫోఫీ కంపెనీ ఎదుట ఆందోళనకు దిగారు. ఇన్ఫోఫీ కంపెనీలో మొత్తం 700 మంది ఉద్యోగులు ఉన్నారు. 650 మంది పేరుతో 4 లక్షల రూపాయలు చొప్పున.... 50 మంది పేరుతో రూ. 10 లక్షల చొప్పున ఇన్ఫోఫీ కంపెనీ లోన్ తీసుకుంది. ఏడాదిన్నరగా సంస్థ ఉద్యోగులకు జీతాలు చెల్లించడంలేదు. జీతాలు అడుగుతుంటే రేపు.. మాపు అంటూ కంపెనీ కాలాయాపన చేసిందని.. ఇప్పుడు ఏకంగా కంపెనీయే మూతపడిందని తమ పరిస్థితి ఏంటని ఉద్యోగులు వాపోతున్నారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Shalini Pandey: ఓ రేంజ్‌లో గ్లామర్ ఒలకబోస్తోన్న ‘అర్జున్ రెడ్డి’ భామ.. చూస్తే మతిపోవాల్సిందే..!

Shriya Saran: వామ్మో.. శ్రియ అందాలు చూస్తే.. పడిపోవాల్సిందే..!

Updated Date - 2023-04-19T13:53:20+05:30 IST