Hyderabad: గచ్చిబౌలి బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌పై రోడ్డు ప్రమాదం
ABN , First Publish Date - 2023-07-24T10:34:40+05:30 IST
హైదరాబాద్: గచ్చిబౌలి బయో డైవర్సిటీ ఫ్లైఓవర్‌పై రోడ్డు ప్రమాదం జరిగింది. ఫ్లైఓవర్ పైనుంచి కిందపడి బైకర్ మృతి చెందాడు. రాయదుర్గం నుంచి మాదాపూర్ వెళ్తున్న యువకులు మితిమీరిన వేగంతో డివైడర్‌ను ఢీకొని మరో ఫ్లైఓవర్‌పై పడ్డారు.
హైదరాబాద్: గచ్చిబౌలి బయో డైవర్సిటీ ఫ్లైఓవర్‌పై రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఫ్లైఓవర్ పైనుంచి కిందపడి బైకర్ మృతి (Biker Dies) చెందాడు. రాయదుర్గం నుంచి మాదాపూర్ వెళ్తున్న యువకులు మితిమీరిన వేగంతో డివైడర్‌ను ఢీకొని మరో ఫ్లైఓవర్‌పై పడ్డారు. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. మృతుడు గచ్చిబౌలిలో నివాసం ఉంటున్న మధు (25)గా గుర్తించారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. సీసీ ఫుటేజీ పరిశీలిస్తున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
హైదరాబాద్‌లో ఉన్న కొన్ని ఫ్లై ఓవర్స్‌పై యాక్సిడెంట్లు చాలా తీవ్రంగా జరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. గచ్చిబౌలి బయో డైవర్సిటీ ఫ్లైఓవర్‌పై గతంలో కూడా ఒక ప్రమాదం జరిగింది. మలుపు అనేది సరైందికాదని తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆ మలుపు వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. అయితే బడా బాబులు, బిల్డర్లకోసం ఈ మలుపు తీసుకువచ్చారని, రూట్ మ్యాప్ ప్లాన్ మార్చడంవల్లే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి.